Budget 2024 : వచ్చే బడ్జెట్‌పై ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాలివి..
Automobile industry on Budget 2024 : 2024 బడ్జెట్‌పై ఆటోమొబైల్ పరిశ్రమలో బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొత్త నిబంధనలు తీసుకురాకపోతే మంచిదని అంటున్నారు.
Automobile industry on Budget 2024 : 2024 బడ్జెట్ కోసం ఆర్థికశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ పరిశ్రమలు.. తమ ఆర్థిక సూచనలను వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. ఆటోమొబైల్ పరిశ్రమ కూడా తమ అంచనాలు, అభిప్రాయాలను ఆర్థికశాఖతో పంచుకుంది. బడ్జెట్‌తో ఆటోమొబైల్ పరిశ్రమలో ఈసారి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
2024 బడ్జెట్‌పై ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాలు..
2024 బడ్జెట్‌పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ సానుకూలంగానే ఉన్నా.. పెద్దగా మార్పులేవీ కనిపించికపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఏఎంఈ-3 స్కీమ్, పీఎల్ఐ స్కీమ్, ఎంట్రీ లెవల్ 2 వీలర్స్‌పై జీఎస్టీ సవరణ వంటి అంశాలపై ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని పరిశ్రమ ఎదురుచూస్తోంది. కానీ.. వీటిల్లో చాలా వరకు విషయాలపై కేంద్రం యథాతథ స్థితినే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"పీఎల్ఐ, ఎఫ్ఏఎంఈ వంటి స్కీమ్స్‌ని తీసుకొచ్చి ఆటోమోటివ్ ఎకోసిస్టెమ్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు. ఈ దఫా బడ్జెట్లో వీటికి కేటాయింపులు కొనసాగుతాయని ఆశిస్తున్నాను," అని ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మేన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ డైరక్టర్ జెనరల్ విన్ని మెహ్తా తెలిపారు.
ఇదీ చూడండి:- Budget 2024 : వచ్చే బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభిస్తుందా? ట్యాక్స్ నిపుణుల మాట ఇది..
Budget 2024 : "ఈ దఫా బడ్జెట్లో మేము ప్రత్యేక ఎస్ఓపీలను ఆశించడం లేదు. ఉన్న వాటిని కొనసాగిస్తే చాలు. మంచి పాలసీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్మెంట్స్, స్థిరత్వంపై కేంద్రం ఫోకస్ చేస్తోంది. దానిని కొనసాగించాలి," అని ఎస్ఐఏఎం (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మేన్యుఫ్యాక్చర్స్) ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
అయితే.. ప్రభుత్వం ఈసారికి ఎలాంటి కొత్త నిబంధనలు తీసుకురాకూడదని అన్నారు వినోద్ అగర్వాల్. ఏదైనా కొత్త నిబంధన తెస్తే ఖర్చులు పెరుగుతాయని, అది సంస్థలకు, ప్రజలకు నష్టం కలిగిస్తాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2024 బడ్జెట్ వివరాలు..
Budget 2024 latest news : 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ని ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగుతాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలా కాకుండా.. ఈ ఫిబ్రవరి 1న మధ్యంత బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. పూర్తిస్థాయి బడ్జెట్.. ఎన్నికల ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బయటకొస్తుంది.
సంబంధిత కథనం