Budget 2024 : వచ్చే బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభిస్తుందా? ట్యాక్స్ నిపుణుల మాట ఇది..
Budget 2024 income tax : 2024 బడ్జెట్‌కు ప్రిపరేషన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈసారి.. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుందా? అన్న విషయంపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Budget 2024 income tax : 2024 బడ్జెట్ ప్రిపరేషన్‌తో పాటు బజ్ కూడా మొదలైంది. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ని ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో.. ఫిజికల్ కన్సాలిడేషన్‌తో పాటు ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ దఫా పద్దు ఉండాలని ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2024 బడ్జెట్లో వేతన జీవులకు ఉపశమనం ఉంటుందా?
2024లో లోక్‌సభ ఎన్నికలు జరగుతాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలా కాకుండా.. ఈ ఫిబ్రవరి 1న మధ్యంత బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. పూర్తిస్థాయి బడ్జెట్.. ఎన్నికల ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బయటకొస్తుంది.
Budget 2024 latest news : "2024 బడ్జెట్లో భారీ సంస్కరణలకు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ విషయంపై మేము కాస్త జాగ్రత్తగా ఉంటాము. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్స్లో సమయానికి అనుగూణంగా మార్పులు కనిపించొచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాతే భారీ మార్పులు కనిపించొచ్చు. జీఎస్టీని మరింత సరళీకృతం చేయడం, ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ని హేతుబద్ధీకరించడం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌పై క్లారిటీ ఇవ్వడం వంటి అంశాలపై కేంద్రం దృష్టిసారించాలని భావిస్తున్నాము," అని షేర్ ఇండియా ఫిన్‌కాప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అగమ్ గుప్తా తెలిపారు.
మరోవైపు.. కొత్త పన్ను విధానంలో స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చే ఆదాయంపై ఉన్న నిబంధనలు మరింత సరళీకృతం అవుతాయని ట్యాక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Budget 2024 date : "స్టాక్ మార్కెట్ ఆదాయంపై ఉన్న క్లాసిఫికేషన్ చాలా కష్టంగా ఉంది. హోల్డింగ్ పీరియడ్ నుంచి వివిధ ట్యాక్స్ కేటగిరీల వరకు ఉన్న అంశాలు.. పన్నుచెల్లింపుదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. వీటిని సింప్లిఫై చేయాలి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అని చూడకుండా.. వీటన్నింటికీ ఏకీకృత ట్యాక్స్ రేట్ తీసుకురావాలి. అప్పుడే క్లారిటీ వచ్చి, పరిపాలనలో సవాళ్లు తగ్గుతాయి. మదుపర్లకు యూజర్ ఫ్రెండ్లీ ట్యక్సేషన్ సిస్టెమ్ని అందివ్వాలి. స్టాక్ మార్కెట్‌తో వచ్చే ఆదాయంపై విధించే పన్ను విషయంలో క్లారిటీ ఉంటే.. అటు పన్ను చెల్లింపుదారులకు, ఇటు సిస్టెమ్కు మంచి జరుగుతుంది," అని ట్యక్స్2విన్ సీఈఓ అభిషేక్ సోని తెలిపారు.
"ఎన్పీఎస్ స్కీమ్‌లో ఉన్న డిడక్షన్స్ని.. ఇతర ఆర్థిక పరమైన అంశాలకు కూడా విస్తరించాలి. హెల్త్ ఇన్ష్యూరెన్స్, వైద్యపరమైన ఖర్చుల ప్రీమియంని తగ్గిస్తే వేతన జీవులకు ఉపశమనం లభిస్తుంది," అని అభిషేక్ సోని అభిప్రాయపడ్డారు.
Budget 2024 income tax changes : "పన్ను సంబంధిత సమస్యలపై ఈసారి కేంద్రం ఫోకస్ చేయవచ్చు. అయితే ఇందుకోసం వేతన జీవులు, వ్యాపారులు కూడా సిద్ధంగా ఉండాలి. డైరక్ట్ ట్యాక్స్ కోడ్‌పై పురోగతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇదే జరిగితే.. ట్యాక్సేషన్ సిస్టెమ్ మరింత సింప్లిఫై అవుతుంది. అందరికి మంచి జరుగుతుంది," అని టీమ్‌లీజ్ రెగ్‌టెక్ కో-ఫౌండర్, డైరక్టర్ సీఏ సందీప్ అగర్వాల్ తెలిపారు.
మొత్తం మీద చూసుకుంటే.. ఈ మధ్యంతర బడ్జెట్ 2024లో భారీ సంస్కరణలు, ప్రకటనలు ఉండకపోవచ్చని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం