Electric scooters sales in India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ దూసుకెళుతోంది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్లో క్రేజీ సేల్స్ జరుగుతున్నాయి. నవంబర్‌లో 91వేలకుపైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే.. అది 20శాతం ఎక్కువ! ఇక ఈ ఏడాది అక్టోబర్‌తో పోల్చుకుంటే.. 22శాతం పెరిగినట్టు!
ఈవీ సెగ్మెంట్లో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్‌లు.. నిదానంగా తమ మార్కెట్ షేర్‌ను పెంచుకుంటున్నాయి. కొత్త కొత్త లాంచ్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటుండటం ఇందుకు కారణం.
Electric 2 wheeler sales in India : నవంబర్‌లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పెనిట్రేషన్ రేటు 5శాతంగా నమోదైంది. ఇక మొత్తం ఈవీ సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్ హవా కొనసాగుతోంది. సంస్థకు ఇక్కడ 32.6శాతం మార్కెట్ షేర్ ఉంది. నవంబర్‌లో 29,764 ఈవీలను విక్రయించింది సంస్థ. ఆ తర్వాతి స్థానంలో టీవీఎస్ ఉంది. ఈ సంస్థ మార్కెట్ షేర్ 20.8శాతం. బజాజ్ ఆటో (12.8శాతం), ఏథర్ ఎనర్జీ (10.1శాతం), గ్రీవ్స్ ఎలక్ట్రిక్ (4.8శాతం) సంస్థలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మంత్ ఆన్ మంత్ సేల్స్ చూస్తే.. హీరో మోటోకార్ప్ దూసుకెళ్లింది! అక్టోబర్‌తో పోల్చుకుంటే.. నవంబర్‌లో సంస్థ ఈవీ సేల్స్ 57శాతం వృద్ధిని సాధించాయి. ఓలా ఎలక్ట్రిక్ (25శాతం), బజాజ్ ఆటో (29శాతం) సంస్థలు ఆ తర్వాతి స్థానాల్లో నిలబడ్డాయి. అదే సమయంలో.. టీవీఎస్, ఏథర్ ఎనర్జీ వంటి సంస్థల సేల్స్ పెద్దగా వృద్ధి చెందలేదు.
India Electric vehicle market : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీ సెగ్మెంట్‌కు బీభత్సమైన డిమాండ్ కనిపిస్తోంది. అటు 4 వీలర్స్‌తో పాటు ఇటు 2 వీలర్స్‌కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు సంస్థలన్నీ పోటీపడి మరి కొత్త కొత్త మోడల్స్‌ని లాంచ్ చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మరి.. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అన్నది వేచి చూడాలి.
సంబంధిత కథనం