Ola electric scooter rent : ఓలా ఎలక్ట్రిక్ సంస్థ మరో కొత్త ఐడియాతో భారతీయుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది! ఓలా ఈ-స్కూటర్ రెంటల్ సర్వీస త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు.. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
"పర్యాటక ప్రాంతాల్లో ఓలా ఎస్1 ప్రాడక్ట్స్ రెంటల్ సర్వీస్ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నాము. దీనిపైన మీ స్పందనేంటి? ఏవైనా సూచలు ఇస్తారా? దేశంలోని ఏ ప్రాంతాల్లో ఈ సేవలు వినియోగించుకోవాలని మీరు అనుకుంటున్నారు?" అని ట్వీట్ చేశారు భవిష్ అగర్వాల్. అంతేకాకుండా.. బెస్ట్ కామెంట్, సూచన చేసిన ఒకరికి ఓల్ ఎస్ఎక్స్+ ఇస్తామని అన్నారు.
Ola electric rental service : ఈ ట్వీట్‌ని చూస్తుంటే.. ఈ ఓలా ఎలక్ట్రిక్ రెంటల్ సర్వీస్ ఐడియా ప్రస్తుతం ఎర్లీ స్టేజ్‌లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ.. ఈ ఐడియా కార్యరూపం దాల్చితే మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల యాక్సెసబులిటీ, అఫార్డెబులిటీ పెరుగుతుందని అంటున్నాయి.
ఇండియాలో ఈ తరహా రెంటల్ బిజినెస్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 2 వీలర్ రెంటల్ బిజినెస్‌లోకి 2023లో ఎంట్రీ ఇచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ. 25 నగరాల్లో ఈ సేవలను తీసుకొచ్చింది. 300కుపైగా బైక్స్‌ని అందుబాటులో ఉంచింది. ఇందుకోసం 40కిపైగా మోటర్‌సైకిల్ రెంటల్ ఆపరేటర్స్‌తో డీల్ కుదుర్చుకుంది.
Ola electric scooters price : ఇక రాయల్ ఎన్ఫీల్డ్ రెంటల్ సర్వీస్ బిజినెస్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ నేర్చుకునేందుకు అవకాశం ఉంది. ఫ్లెక్సిబులిటీ, ఛార్జీలు వంటి వాటిపై ఒక క్లారిటీ రావొచ్చు.
ఇక ఈ రెంటల్ ఐడియా అమల్లోకి వస్తే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తమ మొబైల్ యాప్‌లో ఈ సేవలను కూడా పొందుపరిచే యోచనలో ఓలా ఎలక్ట్రిక్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి రెంటల్ సర్వీసులు ఊపందుకున్నాయి. చాలా మంది.. సొంతంగా ఒక బైక్స్, స్కూటర్ని తీసుకుని టూర్‌ని ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. గోవా, మనాలీ, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో మంచి బిజినెస్ జరుగుతోంది.
అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఈ 2024 తొలినాళ్లల్లో ఓలా ఎలక్ట్రిక్ నుంచి రెంటల్ సేవలు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే సూచనలు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం