Royal Enfield new bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​.. 'గొరిల్లా 450' వచ్చేస్తోంది!-royal enfield guerilla 450 name trademarked is this res next 450 cc bike ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield New Bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​.. 'గొరిల్లా 450' వచ్చేస్తోంది!

Royal Enfield new bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​.. 'గొరిల్లా 450' వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu
Dec 26, 2023 07:15 AM IST

Royal Enfield Guerilla 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి గొరిల్లా 450 పేరుతో ఓ కొత్త బైక్​ వస్తోందని టాక్​ నడుస్తోంది. సరికొత్త 450 ప్లాట్​ఫామ్​పై దీనిని తయారు చేస్తున్నట్టు సమాచారం.

 రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​.. 'గొరిల్లా 450' వచ్చేస్తోంది
రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​.. 'గొరిల్లా 450' వచ్చేస్తోంది (Representative image)

Royal Enfield Guerilla 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ.. ఓ కొత్త బైక్​ని సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 'గొరిల్లా 450' పేరును దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ట్రేడ్​మార్క్​ చేసుకోవడం ఇందుకు కారణం. ఇది.. సరికొత్త 450 సీసీ బైక్​గా వస్తుందని మార్కెట్​లో ఊహాగానాలు మొదలయ్యాయి.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450..

పలు నివేదికల ప్రకారం.. సరికొత్త 450 ప్లాట్​ఫామ్​పై ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ తయారవుతుంది. సెకెండ్​ జనరేషన్​ హిమాలయన్​ 450ని రూపొందించేందుకు ఇదే ప్లాట్​ఫామ్​ని ఉపయోగించింది సంస్థ. కొత్త హిమాలయన్​లో ట్విన్​ స్పార్​ ఛాసిస్​, షేర్పా 450 సీసీ ఇంజిన్​ ఉంటుంది. కొత్త బైక్​లో కూడా ఇవి ఉండొచ్చు.

అయితే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 బైక్​ ఒక రోడ్​స్టర్​గా ఉండొచ్చు. ఇదే నిజమైతే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ లవర్స్​కి పండగే అని మార్కెట్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Royal Enfield new bike : ఇదిలా ఉండగా.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరో విషయం ఏంటంటే.. భవిష్యత్తులో వాడుకునేందుకు.. ఆటోమొబైల్​ సంస్థలు ఇప్పుడే కొన్ని పేర్లను ట్రేడ్​మార్క్​ చేసి పెట్టుకుంటాయి. అలా అని.. అవి కచ్చితంగా బయటకి వస్తాయని చెప్పలేము. రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ ఇప్పటికే.. ఫ్లైయింగ్​ ఫ్లియా, ఇంటర్​సెప్టర్​ బేర్​ 6650, రోడ్​స్టర్​, క్రూజర్​, కేఫ్​ రేస్​తో పాటు ఎన్నో ఆసక్తికర పేర్లను ట్రేడ్​మార్క్​ చేసి పెట్టుకుంది.

కానీ.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 బైక్​ని సంస్థ కచ్చితంగా తీసుకొస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. 450 సీసీ సెగ్మెట్​లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ బైక్​ మంచి ఆప్షన్​ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. గొరిల్లా 450 పేరును రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎందుకు ట్రేడ్​ మార్క్​ చేసుకుందో వేచి చూడాలి.

గోవాన్​ క్లాసిక్​ 350 కూడా..!

Royal Enfield Classic 350 Bobber : రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్స్​పై ఈ మధ్య కాలంలో వార్తలు జోరుగా వస్తున్నాయి. సరికొత్త 350 సీసీ బైక్​ని సంస్థ తయారు చేస్తోందట. ఈ మేరకు.. 'గోవాన్​ క్లాసిక్​ 350' అనే పేరును ట్రేడ్​మార్క్​ చేసి పెట్టుకుందట!

ప్రస్తుతం వార్తల్లో ఉన్న బైక్​.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి బాబర్ వర్షెన్​లా ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఈ బైక్​ ప్రత్యేకంగా బయటకొస్తుందా? లేదా.. క్లాసిక్​ 350లో ఒక వేరియంట్​గా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం