Ather 450X Apex electric scooter : ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!-ather 450x apex to launch in india on january 6 full details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ather 450x Apex Electric Scooter : ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Ather 450X Apex electric scooter : ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Sharath Chitturi HT Telugu
Dec 29, 2023 01:05 PM IST

Ather 450X Apex electric scooter : ఏథర్​ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. దీని పేరు ఏథర్​ 450ఎక్స్​ అపక్స్​.

ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!
ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Ather 450X Apex electric scooter : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​ దూసుకెళుతోంది. అందుకు తగ్గట్టుగానే.. ఆటమొబైల్​ సంస్థలు కొత్త కొత్త స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో.. ఏథర్​ ఎనర్జీ కూడా ఓ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సిద్ధం చేసింది. దీని పేరు ఏథర్​ 450ఎక్స్​ అపెక్స్​. 2024 జనవరి 6న ఈ ఈ-స్కూటర్​ని సంస్థ లాంచ్​ చేయనుంది. అంతేకాకుండా.. ఈ మోడల్​కి సంబంధించిన బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 2,500 టోకెన్​ అమౌంట్​తో ఈ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని బుక్​ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఏథర్​ 450ఎక్స్​ అపెక్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాము..

ఏథర్​ 450ఎక్స్​ అపెక్స్​ ఫీచర్స్​..

ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​లో సరికొత్త రైడింగ్​ మోడ్​ ఉండనుంది. దీని పేరు వార్ప్​+. 450ఎక్స్​ ఈవీలో ఉన్న వార్ప్​ మోడ్​ని ఇది రిప్లేస్​ చేయనుంది. ఫలితంగా.. ఏథర్​ ఎనర్జీ లైనప్​లో ఉన్న ఫాస్టెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా ఈ 450ఎక్స్​ అపెక్స్​ మారనుంది. 0-40 కేఎంపీహెచ్​ స్పీడ్​ని కేవలం 3.3 సెకన్లలో అందుకోనుంది ఈ కొత్త స్కూటర్​. ఇక ఈ ఈవీలో బ్రేక్​ రీజనరేషన్​ లెవల్​ సెటప్​ కూడా ఉండనుంది. ట్రాడీషనల్​ బ్రేక్స్​ని ఇవి రిప్లేస చేస్తాయి.

Ather 450X Apex launch date : ఏథర్​ 450ఎక్స్​ అపెక్స్​ బ్యాటరీ ప్యాక్​, ఎలక్ట్రిక్​ మోటార్​కు సంబంధించిన వివరాలపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది. ఈ మోడల్​ ధరకు సంబంధించిన వివరాలు కూడా సంస్థ ప్రకటించాల్సి ఉంది.

ఇదీ చూడండి:- Electric scooters in India 2023 : ఇండియాలో లాంచ్​ అయిన టాప్​ ఈ-స్కూటర్లు ఇవే!

ఇక 2024లో వరుస ఈ-స్కూటర్ల లాంచ్​కు సిద్ధమవుతోంది ఏథర్​ ఎనర్జీ. 450ఎక్స్​ అపెక్స్​ తర్వాత.. ఓ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని తయారు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇది కూడా.. 2024లోనే లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

Ather 450X Apex features : ఇవన్నీ చూస్తుంటే.. ఈవీ లవర్స్​కి 2024 కూడా మంచి కిక్​ ఇస్తుందని స్పష్టమవుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం