Kinetic E Luna : కైనెటిక్​ ఈ-లూనా వచ్చేస్తోంది- ఎలక్ట్రిక్​ మోపెడ్​ బుకింగ్స్​ షురూ..-automobile news india kinetic e luna bookings open launch in next month ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kinetic E Luna : కైనెటిక్​ ఈ-లూనా వచ్చేస్తోంది- ఎలక్ట్రిక్​ మోపెడ్​ బుకింగ్స్​ షురూ..

Kinetic E Luna : కైనెటిక్​ ఈ-లూనా వచ్చేస్తోంది- ఎలక్ట్రిక్​ మోపెడ్​ బుకింగ్స్​ షురూ..

Sharath Chitturi HT Telugu
Jan 26, 2024 07:00 AM IST

Kinetic E Luna bookings : కైనెటిక్​ ఈ-లూనా వచ్చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్​ మోపెడ్​ బుకింగ్స్​ని ప్రారంభించింది సంస్థ. ఫిబ్రవరిలో లాంచ్​కానుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

కైనెటిక్​ ఈ-లూనా బుకింగ్స్​ షురూ..
కైనెటిక్​ ఈ-లూనా బుకింగ్స్​ షురూ..

Kinetic E Luna moped launch : కైనెటిక్​ లూనా.. సరికొత్త ఎలక్ట్రిక్​ అవతారంలో తిరిగొస్తోంది! ఈ కైనెటిక్​ ఈ- లూనాపై గత కొన్ని నెలలుగా అప్డేట్స్​ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ ఎలక్ట్రిక్​ మోపెడ్​ అధికారిక టీజర్​ని విడుదల చేసింది కైనెటిక్​ గ్రీన్​ సంస్థ. అంతేకాకుండా.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ బుకింగ్స్​ని కూడా మొదలుపెట్టింది. రూ. 500 టోకెన్​ అమౌంట్​తో ఈ మోడల్​ని బుక్​ చేసుకోవచ్చు. ఈ కైనెటిక్​ ఈ-లూనా.. ఫిబ్రవరిలో లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

కైనెటిక్​ ఈ-లూనా ఫీచర్స్​..

లూనా అంటే.. భారతీయులకు ఒక ఎమోషన్​. ఒకానొక సమయంలో దాదాపు ప్రతి గ్రామీణ భారతంలోని ఇంట్లో ఈ లూనా ఉండేది! కానీ పోటీని తట్టుకోలేక.. ఈ మోడల్​ కనుమరుగైపోయింది. కాగా.. ఇప్పుడు ఈ లూనాకి ఎలక్ట్రిక్​ టచ్​ ఇస్తోంది కైనెటిక్​ గ్రీన్​ సంస్థ. ఈ కైనెటిక్​ ఈ-లూనా ఎలక్ట్రిక్​ వెహికిల్​ డిజైన్​.. పాత తరం మోడల్​ని పోలి ఉంది. స్ట్రక్చర్​ సింపుల్​గా ఉంది. స్ల్పిట్​ సీట్​, స్క్వేర్​ హెడ్​లైట్​ వంటివి వస్తున్నాయి. ఇందులో 16 ఇంచ్​ స్పోక్​డ్​ వీల్స్​ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్​ మోపెడ్​ బరువు 96 కేజీలు. ఓషన్​ బ్లూ, మల్బెర్రీ రెడ్​ కలర్స్​లో అందుబాటులోకి రానుంది.

Kinetic E Luna price in India : ఇక ఈ కైనెటిక్​ ఈ-లూనా మోపెడ్​లో టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​, డ్యూయెల్​ రేర్​ స్ప్రింగ్స్​, డ్రమ్​ బ్రేక్స్ (రెండు వీల్స్​కి) లభిస్తున్నాయి. దీనిని.. లాస్ట్​ మినిట్​ డెలివరీ మోడల్​గా సిద్ధం చేసింది సంస్థ.

కైనెటిక్​ ఈ- లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​లో 2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 110కి.మీ దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. దీని టాప్​ స్పీడ్​ 50కేఎంపీహెచ్​. పోర్ట్​బుల్​ ఛార్జర్​ ఫీచర్​ లభిస్తోంది. ఫుల్​ ఛార్జ్​ అవ్వడానికి కేవలం 4 గంటల సమయమే పడుతుందట!

కైనెటిక్​ ఈ-లూనా ధర ఎంత ఉండొచ్చు..?

Kinetic E Luna range : ఈ ఎలక్ట్రిక్​ మోపెడ్​ ధరకు సంబంధించిన వి​వరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. ఈ కైనెటిక్​ లూనా ఎక్స్​షోరూం ధర రూ. 75వేలుగా ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం