Citroen C3 Aircross price : ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్.. తాజాగా ఓ మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అదే సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన బుకింగ్స్ శుక్రవారమే ప్రారంభమయ్యాయి. 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వెహికిల్ వేరియంట్లు, వాటి ధరలను ఇక్కడ తెలుసుకుందాము..
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ యూ- రూ. 9.99లక్షలు
ప్లస్- రూ. 11.50లక్షలు- రూ. 11.45లక్షలు
మ్యాక్స్- రూ. 11.95లక్షలు- 12.10లక్షలు
Citroen C3 Aircross SUV : 5+2 ఫ్లెక్సీ ప్రో (ప్లస్- మ్యాక్స్)- రూ. 35వేలు అదనం
డ్యూయెల్ టోన్ (ప్లస్- మ్యాక్స్)- రూ. 20వేలు అదనం
వైబ్ ప్యాక్ (ప్లస్- మ్యాక్స్)- రూ. 25వేలు అదనం
* పైన చెప్పిన ధరలు.. ఎక్స్‌షోరూం ధరలు మాత్రమే. ఆన్ రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
హైదరాబాద్‌లో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలియాల్సి ఉంది.
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ను రూ. 25వేల టోకెన్ అమౌంట్‌తో సంస్థకు చెందిన వెబ్సైట్ లేదా డీలర్షిప్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి డెలివరీలు మొదలుపెట్టాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.
Citroen C3 Aircross price Hyderabad : ఇండియాలో.. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో 3- రో సీటింగ్ ఆప్షన్ కలిగి ఉన్న తొలి వెహికిల్ ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ కావడం విశేషం. హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి మోడల్స్‌కు ఈ ఎస్యూవీ గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ వెహికిల్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 108 హెచ్‌పీ పవర్‌ను, 190 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎస్యూవీ.. 18.5 కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం కేవలం 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కూడా రావొచ్చు.
Citroen C3 Aircross on road price in Hyderabad : ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ వెడల్పు 1,799. పొడవు 4,323. ఎత్తు 1,699. వీల్‌బేస్ 2,671ఎంఎం.
సంబంధిత కథనం