Mahindra XUV3X0 : మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్0.. స్టైలిష్ ఎస్యూవీ వచ్చేస్తోంది!
Mahindra XUV3X0 price : మహీంద్రా ఎక్స్‌యూవీ నుంచి ఓ కొత్త ఎస్యూవీ రాబోతోంది. ఇది.. మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ అని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
Mahindra XUV3X0 : ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలో ఎస్యూవీ సెగ్మెంట్లో దూసుకెళుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ నుంచి మరో కీలక అప్డేట్! సరికొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు సంస్థ రెడీ అవుతోంది. ఏప్రిల్ 29న ఓ మోడల్ని రివీల్ చేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. దీని పేరు.. మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్0. ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా కనిపిస్తున్న ఎక్స్‌యూవీ3ఎక్స్0 రి సంబంధించిన వీడియోను కంపెనీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీతో పాటు రాబోయే 5-డోర్ థార్ ఎస్‌యూవీలను లాంచ్‌కి ముందు కొంతకాలంగా భారత రోడ్లపై టెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎక్స్‌యూవీ 3ఎక్స్0.. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెర్నాతో పాటు కొత్తగా లాంచ్ చేసిన టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ వంటి ఇతర సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్0..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్0 టీజర్ వీడియోలో.. ఎస్యూవీ కొత్త గ్రిల్, కొత్త సెట్ ఎల్ఈడీ డీఆర్ఎల్లు, ముందు భాగంలో హెడ్‌లైట్ యూనిట్ కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో.. ఈ ఎస్యూవీ కనెక్టెడ్ టెయిల్ లైట్లతో వస్తుంది. ఎక్స్‌యూవీ3ఎక్స్0లో వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉంటుందని ఈ వీడియో సూచిస్తోంది. ఈ ఎస్యూవీ అలాయ్ డిజైన్ కూడా గతంలో ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో మహీంద్రా ఉపయోగించిన వాటి కంటే భిన్నంగా కనిపిస్తోంది. ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ మోడల్ స్పై షాట్స్‌లో గమనించిన అప్డేట్లకు అనుగుణంగా ఈ మార్పులు ఉన్నాయి. అంతేకాకుండా.. ఇది ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పోలికలు కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీకి బిగ్గెస్ట్ అడిషన్.. సన్‌రూఫ్.
Mahindra XUV300 facelift : రాబోయే మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్0 ఇంటీరియర్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎక్స్‌యూవీ 300తో పోలిస్తే అనేక నవీకరణలతో ఉంది. కొత్త మోడల్లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ ఉందని, బహుశా స్కార్పియో-ఎన్స ఎక్స్‌యూవీ700 ఎస్యూవీ లోపల మహీంద్రా ఉపయోగించే అదే యూనిట్ ఉండొచ్చని, కానీ చిన్న పరిమాణంలో ఉంటుందని స్పై షాట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. డ్రైవర్ డిస్ప్లేను కూడా అప్డేట్ చేయాలని సంస్థ భావిస్తోందట. వైర్లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, న్యూ అర్హోలిస్ట్రీ వంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
కొత్త ఎస్యూవీ సెక్యూరిటీ ఫీచర్స్..
మహీంద్రా ఇటీవల షేర్ చేసిన ఒక వీడియో కూడా ఎక్స్‌యూవీ3ఎక్స్0లో కొన్ని భద్రతా ఫీచర్లను ధృవీకరించింది. ఈ ఎస్‌యూవీలో ఏడు ఎయిర్ బ్యాగులు, అన్ని వీల్స్‌కి డిస్క్ బ్రేకులు, ఇరువైపులా పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్), హిల్-హోల్డ్ అసిస్ట్తో కూడిన ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్ కూడా వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఉన్నాయి.
Mahindra XUV3X0 launch date in India : ఎక్స్‌యూవీ 300లో ఉన్న ఇంజిన్, ట్రాన్స్మిషన్ యూనిట్‌తో ఎక్స్ యూవీ3ఎక్స్0 వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్స్‌యూవీ300 ఫేస్ లిఫ్ట్ రెండు టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు, ఒక డీజల్ ఇంజిన్ ఆప్షన్‌తో వస్తోంది. 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.. 108 బిహెచ్పీ పవర్‌ని- 200 ఎన్ఎమ్ టార్క్‌ని, 1.2-లీటర్ జీడీఐ టర్బో ఇంజిన్ 128 బీహెచ్పీ పవర్‌ని- 230 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్.. 115బీహెచ్పీ పవర్ - 300ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అన్ని ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటాయి. టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కూడా 6-స్పీడ్ ఏఎమ్‌టీ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతాయి.
ఇక ఈ మోడల్ ధరతో పాటు ఇతర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
సంబంధిత కథనం