Mahindra XUV 3XO: లాంచ్ కు ముందే మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం
Mahindra XUV 3XO bookings open: మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన మహీంద్రా డీలర్ షిప్ ల వద్ద రూ .21,000 టోకెన్ మొత్తం చెల్లించి ఈ సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీని బుక్ చేసుకోవచ్చు.
Mahindra XUV 3XO bookings open మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను ఏప్రిల్ 29 న లాంచ్ చేయనున్నారు. మహీంద్రా ఎక్స్ యూ వీ 300 ను మరింత అప్ గ్రేడ్ చేసి ఈ మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను రూపొందించారు. మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను కొనుగోలు చేయాలని మీరు నిర్ణయించుకుని ఉంటే, ఎంపిక చేసిన మహీంద్రా డీలర్ షిప్ లు అనధికారికంగా ఈ ఎస్ యూ వీ బుకింగ్స్ ను ప్రారంభించాయి. ఆ డీలర్ల వద్ద రూ.21,000 టోకెన్ మొత్తం చెల్లించి, మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను బుక్ చేసుకోవచ్చు.
వేరే వాహనాల బుకింగ్స్ ను మార్చుకోవచ్చు..
మహీంద్ర వాహనాలకు సంబంధించి మరో ఆఫర్ ను కూడా కస్టమర్లకు అందిస్తున్నారు. ఒకవేళ, ముందే వేరే మహీంద్ర వాహనాల కోసం బుక్ చేసుకుని ఉంటే, ఆ బుకింగ్ ను మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కు మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అదే సమయంలో, ఇప్పటికే మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్ యూ వీ 300 పై రూ .1.59 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు ఎంపిక చేసిన పెట్రోలు లేదా డీజిల్ వేరియంట్లపై మాత్రమే వర్తిస్తాయి.
టాటా నెక్సాన్ ప్రత్యర్థి మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ
రాబోయే మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO).. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ గా ఉన్న టాటా నెక్సాన్ కు బలమైన ప్రత్యర్థిగా నిలవనుంది. మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ కొత్త డిజైన్ ఇప్పటికే వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందులోని షార్ప్ గ్రిల్, కొత్త ఇన్వర్టెడ్ సి-ఆకారంలో ఉన్న ఎల్ఇడి డిఆర్ఎల్స్, డబుల్-బ్యారెల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త డిజైన్ లో వచ్చిన బంపర్ మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను మరింత ఆకర్షణీయం చేశాయి.
మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ఫీచర్స్
మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) లో పలు అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, పెద్ద ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 360 డిగ్రీల వ్యూ కెమెరా, ఏడు ఎయిర్ బ్యాగులు, ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, లెవల్ 2 ఎడిఎఎస్ తదితర ఫీచర్స్ ఉన్నాయి. మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ప్రవేశిస్తున్న సెగ్మెంట్లో ప్రస్తుతం మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, సిట్రోయెన్ సి3 ఎయిర్ క్రాస్ మొదలైన మోడల్స్ ఉన్నాయి.
టాపిక్