Mahindra Bolero Neo+ launch: భారత్ లో మహింద్రా బొలెరో నియో ప్లస్ లాంచ్; ధర ఎంతంటే..?-mahindra bolero neo launched in india at rs 11 39 lakh check all details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Bolero Neo+ Launch: భారత్ లో మహింద్రా బొలెరో నియో ప్లస్ లాంచ్; ధర ఎంతంటే..?

Mahindra Bolero Neo+ launch: భారత్ లో మహింద్రా బొలెరో నియో ప్లస్ లాంచ్; ధర ఎంతంటే..?

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 08:24 AM IST

Mahindra Bolero Neo+ launch: వ్యక్తిగత, వాణిజ్య ఉపయోగం కోసం 9 సీట్ల కాన్ఫిగరేషన్ తో బొలెరో నియో ప్లస్ ను మహింద్రా ప్రవేశపెట్టింది. డ్యూయల్-టోన్ థీమ్ తో క్లాసీ ఇంటీరియర్, టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు, ఏబీఎస్, ఎయిర్ బ్యాగ్స్ తదితర సెక్యూరిటీ ఫీచర్స్ ను ఈ ఎస్యూవీ లో పొందుపర్చారు.

భారత్ లో బొలెరో నియో ప్లస్ లాంచ్
భారత్ లో బొలెరో నియో ప్లస్ లాంచ్ (Mahindra)

Mahindra Bolero Neo+ launch: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బొలెరో నియో ప్లస్ ను మహింద్రా ఇండియా భారత్ లో ఆవిష్కరించింది. ‘‘బొలెరో బ్రాండ్ మా వినియోగదారులలో విశ్వసనీయతకు పర్యాయపదంగా స్థిరపడింది. ఈ ధృఢమైన ఎస్ యూ వీ కస్టమర్ల అంచనాలను నిరంతరం అధిగమిస్తూ వచ్చింది. బొలెరో నియో+ (Mahindra Bolero Neo+) ను ప్రవేశపెట్టడం ద్వారా వారి బొలెరో ఎంపిక అవకాశాలు మరింత పెరిగాయి’’ అని మహింద్ర అండ్ మహింద్ర ప్రకటించింది.

మహింద్రా బొలెరో నియో ప్లస్ గురించి తెలుసుకోవలసిన ఐదు విషయాలు

  • అదనపు క్యాబిన్ స్పేస్ అవసరమైన కస్టమర్ల కోసం మహీంద్రా బొలెరో నియో ప్లస్ ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ .11.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్ తొమ్మిది సీట్ల కాన్ఫిగరేషన్ ను కలిగి ఉంది, ఇది వ్యక్తిగత అవసరాలకు, వాణిజ్య అవసరాలకు ఉపయుక్తమైనది.
  • బొలెరో లోని స్టాండర్డ్ డిజైన్ ను కొనసాగిస్తూనే, మరింత అప్ డేటెడ్ గా బొలెరో నియో ప్లస్ (Mahindra Bolero Neo+) వస్తోంది. స్టాండర్డ్ బొలెరో కన్నా ఇది కొంత పొడవు ఎక్కువగా ఉంటుంది. బంపర్లు, టెయిల్ లైట్స్ డిజైన్ ను స్వల్పంగా మార్చారు. వీటివల్ల ఇది స్టాండర్డ్ బొలెరో నియో కన్నా కాస్త వేరుగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన ఐదు-స్పోక్ డిజైన్ తో కూడిన అద్భుతమైన క్రోమ్ స్లాటెడ్ గ్రిల్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ ఎస్ యూ వీ ఆకర్షణను మరింత పెంచాయి.
  • ఈ బొలెరో నియో ప్లస్ (Mahindra Bolero Neo+) ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్ కు అనుగుణంగా గోధుమ రంగు యాక్సెంట్స్ తో ఆల్-బ్లాక్ డ్యాష్ బోర్డు ఉంది. ఫ్యాబ్రిక్ బీజ్ సీట్ అప్ హోల్ స్టరీ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. డోర్ హ్యాండిల్స్, ఏసీ వెంట్ లపై సిల్వర్ లైనింగ్ తో ఈ ఎస్ యూ వీ మరింత అధునాతనంగా కనిపిస్తుంది. ఇందులో 2+3+4 సీట్ల లేఅవుట్, రెండో వరుస వెనుక జంప్ సీట్లతో సహా, ఇది ప్రయాణీకులకు, సరుకు రవాణాకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.
  • బొలేరో (Mahindra Bolero Neo+) లో యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఛార్జింగ్ పోర్ట్ లు కూడా ఉన్నాయి.
  • ఈ ఎస్ యూవీ (Mahindra Bolero Neo+) లో ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ లతో కూడిన ఎబిఎస్ ఉంది. ఇందులోని 2.2-లీటర్ డీజల్ ఇంజన్ 120 పిఎస్, 280 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, బొలెరో నియో లోని వేరియంట్లలో అందుబాటులో ఉన్న మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ ఇందులో లేదు.

WhatsApp channel