Mahindra Bolero Neo Plus 2023 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. బొలేరో నియో ప్లస్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీకి సంబంధించిన వేరియంట్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటి వివరాలు ఓసారి చూద్దాము..
టీయూవీ300ను రీబ్యాడ్జ్ చేసి బలేరో నియోను తీసుకొచ్చింది ఎం అండ్ ఎం సంస్థ. థర్డ్ జనరేషన్ స్కార్పియో ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించింది. ఇదొక ఆఫ్ రోడ్ కేపబులిటీ ఎస్యూవీ. ఇక ఇప్పుడు బొలేరో నియోకు ఎక్స్టెండెడ్ వర్షెన్ అయిన బొలేరో నియో ప్లస్‌ను తీసుకొచ్చేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇదొక 9 సీటర్ ఎస్యూవీ అని తెలుస్తోంది.
ఈ వెహికిల్ డిజైన్.. సాధారణ బొలేరో నియో మోడల్‌ను పోలి ఉంటుంది. మస్క్యులర్ క్యామ్షెల్ బానెట్, క్రోమ్ స్లేటెడ్ గ్రిల్, డీఆర్ఎల్స్తో కూడిన స్వెప్ట్ బ్యాక్ హాలోజెన్ హెడ్‌లైట్స్, స్క్వేర్డ్ ఔట్ విండోస్, 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వంటివి వస్తున్నాయి. ఇక రేర్‌లో.. వ్రాప్- అరౌండ్ టెయిల్‌లైట్స్, రేర్ వైపర్, వాషర్ యూనిట్, టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ వంటివి లభిస్తున్నాయి.
ఈ ఎస్యూవీ ఇంటీరియర్‌కు సంబంధించిన వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే.. ఇందులో 9 సీటర్ స్పేషియస్ కేబిన్, టూ టోన్ అప్‌హోలిస్ట్రీ, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కనెక్టివిటీ ఆప్షన్స్ వంటివి ఉంటాయని అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ కొత్త బొలేరో వర్షెన్‌లో 2.2 లీటర్ ఎంహాక్, ఇన్లైన్ 4 సిలిండర్, డీజిల్ ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇంజిన్ 118హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. స్కార్పియో, థార్లలో ఇదే ఇంజిన్‌ను వాడుతున్నారు. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో ఉంటుంది.
ఈ కొత్త మహీంద్రా ఎస్యూవీ లాంచ్‌తో పాటు ధరకు సంబంధించిన వివరాలపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే.. రానున్న కొన్ని నెలల్లోనే ఈ మోడల్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 9.63లక్షలు- రూ. 12.14లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం