Mahindra Bolero and Bolero Neo prices increased : మహీంద్రా బొలేరో ధరలు పెరిగాయి!-mahindra bolero and bolero neo prices increased today check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mahindra Bolero And Bolero Neo Prices Increased Today Check Details

Mahindra Bolero and Bolero Neo prices increased : మహీంద్రా బొలేరో ధరలు పెరిగాయి!

Sharath Chitturi HT Telugu
Sep 20, 2022 01:15 PM IST

Mahindra Bolero price increased : మహీంద్రా బొలేరో, బొలేరో నియో వాహనాల ధరలు పెరిగాయి. ఆ వివరాలు..

మహీంద్రా బొలేరో ధరలు పెరిగాయి!
మహీంద్రా బొలేరో ధరలు పెరిగాయి!

Mahindra Bolero price : బొలేరో, బొలేరో నియో ధరలను పెంచుతున్నట్టు దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా బొలేరోపై రూ. 22వేలు, బొలేరో నియోపై రూ. 21,007 వరకు పెంచుతున్నట్టు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

మహీంద్రా బొలేరో బీ4 వేరియంట్​పై రూ. 20,701.. బొలేరో బీ6(ఓ) వేరియంట్​పై రూ. 22 వేలు పెంచారు. ఫలితంగా.. ధరల పెంపు అనంతరం మహీంద్రా బొలేరో రూ. 9.45లక్షలకు(ఎక్స్​ షోరూమ్​) అందుబాటులోకి రానుంది. ఇక బొలేరో నియో ఎన్​4పై రూ. 18,800.. ఎన్​10పై రూ. 21,007.. నియో10(ఓ)పై రూ. 20,502ని పెంచింది మహీంద్రా. ఫలితంగా ఇప్పుడు మహీంద్రా బలేరో నియో ధర రూ. 9.48లక్షలు- రూ. 11.99లక్షల(ఎక్స్​ షోరూమ్​) మధ్య ఉండనుంది.

Mahindra Bolero Neo price : మహీంద్రా బొలేరోకి 1.5లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. దీని పవర్​ 75బీహెచ్​పీ, టార్క్​ 210ఎన్​ఎం. 5స్పీడ్​ మ్యాన్యువల్​​ గేర్​ బాక్స్​ దీని సొంతం. మరోవైపు 100బీహెచ్​పీ, 240ఎన్​ఎం టార్క్​ను జెనరేట్​ చేసే 1.5లీటర్​ డీజిల్​ మోటార్​.. మహీంద్రా బొలేరో నియోలో ఉంటుంది. దీనికి కూడా 5స్పీడ్​ మ్యాన్యువల్​​ గేర్​ బాక్స్ లభిస్తుంది.

మహీంద్రా వాహనాల ధరల పెంపు..

M & M prices increased : మహీంద్రా వాహనాల ధరలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. మహీంద్రా ఎక్స్​యూవీ700 ధర రూ. 37,000 వరకు పెరిగింది. పెట్రోల్​ వేరియంట్​ ప్రైజ్​ హైక్​ రూ. 22,000- రూ. 35000 మధ్యలో ఉంది. ఇక డీజిల్​ వేరియంట్​ ప్రైజ్​ హైక్​ రూ. 20వేలు- రూ. 37వేల మధ్యలో ఉంది. మహీంద్రా ఎక్స్​యూవీ వాహనాల ధరల పెంపు.. ఇప్పటికే ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఇక మహీంద్రా థార్​ ధర రూ. 28వేలు పెరిగింది.

ఇక ఎక్స్​యూవీ400 ఈవీతో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్నెంట్​లోకి కూడా ప్రవేశించింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం