5 door Mahindra Thar : 5 డోర్​ మహీంద్రా థార్​ వచ్చేస్తోంది..!-5 door mahindra thar variant expected to launch soon check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  5 Door Mahindra Thar Variant Expected To Launch Soon, Check Details

5 door Mahindra Thar : 5 డోర్​ మహీంద్రా థార్​ వచ్చేస్తోంది..!

Sharath Chitturi HT Telugu
Sep 12, 2022 03:18 PM IST

5 door Mahindra Thar : మహీంద్రా థార్​లో 5 డోర్​ వేరియంట్​ త్వరలో లాంచ్ ​కానుంది! ఈ మోడల్​పై ఉన్న అంచనాలను ఇక్కడ తెలుసుకోండి.

5 డోర్​ మహీంద్రా థార్​ వచ్చేస్తోంది..!
5 డోర్​ మహీంద్రా థార్​ వచ్చేస్తోంది..!

Mahindra Thar 5 door model : ఎలక్ట్రిక్​ వాహనాలు, ఎస్​యూవీలతో జోరు మీద ఉన్న మహీంద్రా అండ్​ మహీంద్రాకు సంబంధించి.. ఇప్పుడు మరో వార్త బయటకొచ్చింది. మహీంద్రా థార్​కు సంబంధించిన కొత్త మోడల్​ను లాంచ్​ చేసేందుకు ఎం అండ్​ ఎం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ కొత్త మహీంద్రా థార్​.. 5 డోర్​ వేరియంట్​ అని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్​పోలో మహీంద్రా థార్​ 5 డోర్​ మోడల్​ను ప్రదర్శించే అవకాశం ఉంది. ఇదే ఎక్స్​పోలో మారుతీ సుజుకి జిమ్ని 5 డోర్​ మోడల్​, ఫోర్స్​ గూర్ఖ 5 డోర్​ మోడళ్లు కూడా ప్రదర్శనకు వస్తాయని అంచనాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం ఉన్న మహీంద్రా థార్​లో 3 డోర్​ మోడల్స్​ ఉన్నాయి. ఇక మహీంద్రా థార్​ 5 డోర్​ మోడల్​లో భారీ వీల్​ బేస్​ ఉంటుందని తెలుస్తోంది. టెయిల్​ లైట్​తో పాటు రేర్​లో స్పేర్​ వీల్​ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​.. రెక్టాంగ్యులర్​ షేప్​లో ఉండొచ్చు. ఇక మహీంద్రా థార్​ 5 డోర్​ లోపలి భాగంలో స్పేస్​ ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

5 door Mahindra Thar model : 3 డోర్​ మోడల్​ కన్నా.. 5 డోర్​ మహీంద్రా థార్​లో మరింత స్టెబులిటీ ఉంటుందని మార్కెట్​ నుంచి అంచనాలు వెలువడుతున్నాయి. 3 డోర్​ మహీంద్రా థార్​.. 4 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక 5 డోర్​ మహీంద్రా థార్​ మోడల్​ 4.3మీటర్ల పొడవు ఉండొచ్చు. స్కార్పియో ఎన్​ 4.7 మీటర్ల పొడవు ఉంది.

మహీంద్రా థార్​ 5 డోర్​ మోడల్​లో 2.2లీటర్​ ఎంహాక్​ డీజిల్​ ఇంజిన్​, 2 లీటర్​ ఎంస్టాలియన్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండొచ్చు.

మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ..

Mahindra XUV400 EV latest news : ఇటీవలే ఎక్స్​యూవీ400 ఈవీని మార్కెట్​లోకి లాంచ్​ చేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా. టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​, నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​కు ఇది గట్టి పోటీగా నిలుస్తోంది.

మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ మోడల్​కి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం