Kia Sonet vs Mahindra XUV300 : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?-kia sonet vs mahindra xuv300 which sub compact suv to go for ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Sonet Vs Mahindra Xuv300 : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

Kia Sonet vs Mahindra XUV300 : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Mar 05, 2024 07:22 AM IST

Kia Sonet vs Mahindra XUV300 : కియా సోనెట్​ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ300. ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది కొనాలి? ఏది బెస్ట్​?

కియా సోనెట్​ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ300..
కియా సోనెట్​ వర్సెస్​ మహీంద్రా ఎక్స్​యూవీ300..

Kia Sonet vs Mahindra XUV300 : ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీల్లో ఒకటి కియా సోనెట్​. సెల్టోస్​ సక్సెస్​ తర్వాత.. ఈ మోడల్​ని ఇండియాలోకి తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక ఈ ఏడాది జనవరిలో కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సైతం లాంచ్​ చేసింది. ఫలితంగా.. సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా.. మహీంద్రా ఎక్స్​యూవీ300కి కియా సోనెట్​కి మధ్య పోటీ మరింత పెరిగింది. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? అని కస్టమర్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ రెండిట్లో ఏది బెస్ట్​? ఏది కొనాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము. కియా సోనెట్ - మహీంద్రా ఎక్స్ యువి 300 మధ్య ధర, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్ల ఆధారంగా పోలికను పరిశీలిద్దాం.

కియా సోనెట్ వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ300: స్పెసిఫికేషన్

కియా సోనెట్​ ఎస్​యూవీలో రెండు పెట్రోల్ ఇంజన్లు, ఒక డీజిల్ ఇంజిన్​ ఆప్షన్​ ఉంటాయి. పెట్రోల్ లైనప్​లో 1.2 లీటర్ యూనిట్, 1.0 లీటర్ టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్ ఉన్నాయి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో వస్తుంది. ఇది 82 బీహెచ్​పీ పవర్​ని, 115 ఎన్ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

Kia Sonet on road price in Hyderabad : మరోవైపు, 1.0-లీటర్ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఐఎంటి లేదా 7-స్పీడ్ డీసీటీ గేర్​బాక్స్​తో కనెక్ట్​ అయ్యి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 118బిహెచ్​పీ పవర్​, 172ఎన్ఎం టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వేరియంట్.. 114 బీహెచ్​పీ పవర్, 250 ఎన్ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్​తో లభిస్తుంది.

ఇక మహీంద్రా ఎక్స్​యూవీ300లో రెండు పెట్రోల్ ఇంజిన్లు, ఒక డీజిల్ ఇంజిన్​ ఆప్షన్​ ఉంటాయి. ఇందులోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 108బీహెచ్​పీ పవర్​ని 200ఎన్ఎం టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. 1.2 లీటర్ టర్బోచార్జ్​డ్​ పెట్రోల్ ఇంజిన్ 128 బీహెచ్​పీ పవర్​ని, 250 ఎన్ఎం టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్ 1.5 లీటర్ టర్బోఛార్జ్​డ్ యూనిట్​.. 115 బీహెచ్​పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్​యూవీ 300 ఎస్​యూవీలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్​బాక్స్ , 6-స్పీడ్ ఏఎమ్​టీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

కియా సోనెట్ వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ300: ఫీచర్స్​..

ఎక్స్​యూవీ300లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్​రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా, ఇది ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్​పీ విత్ హిల్-హోల్డ్ అసిస్ట్​తో పాటు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్​లు కలిగి ఉంది.

ఎక్స్​యూవీ 300కి త్వరలోనే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వస్తుందని సమాచారం. అప్డేటెడ్ మోడల్స్​లో ఏడీఏఎస్ ఫీచర్లు, కొత్త భారీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్​ ఉంటాయని తెలుస్తోంది.

Mahindra XUV300 on road price in Hyderabad : ఇక.. సోనెట్ లెవల్ 1 ఏడీఏఎస్​ సహా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, ఆటో హై బీమ్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్​లను కియా చేర్చింది. అదనంగా, కియా సోనెట్​ వెనుక భాగంలో లైట్ బార్- సెల్టోస్​లో కనిపించే మెరుగైన ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లేతో అప్​డేట్ చేసింది.

కియా సోనెట్ వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ300: ధర

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్​యూవీ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.14.69 లక్షలు (ఎక్స్ షోరూమ్), మహీంద్రా ఎక్స్ యూవీ300 ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉంది.

రెండు ఎస్​యూవీలు ఒకే ధరతో ప్రారంభమైనా.. సోనెట్ టాప్ ఎండ్ వేరియంట్ ధర ఎక్స్​యూవీ 300 కంటే ఎక్కువగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం