Hyundai Creta facelift : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. వేరియంట్లు- వాటి ధరలు ఇవే!
16 January 2024, 15:15 IST
- 2024 Hyundai Creta : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయ్యింది. ఈ ఎస్యూవీ వేరియంట్లు, వాటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర ఎంతంటే..
Hyundai Creta facelift launch date : 2024 మచ్ అవైటెడ్ ఫేస్లిఫ్ట్ల్లో హ్యుందాయ్ క్రేటా ఒకటి. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని సంస్థ తాజాగా లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్..
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్‌లో గ్రిల్‌ని రీడిజైన్ చేసింది సంస్థ. ఎలాంగేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ స్ట్రిప్, క్వాడ్ బీమ్ హెడ్‌ల్యాంప్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటివి వస్తున్నాయి. రేర్‌లో.. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిలైట్స్, షార్క్ ఫిన్ యాంటీనా, వైపర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌లు ఉంటాయి. ఈ ఎస్‌యూవీలోని ప్రీమియం వేరియంట్స్‌కి రీడిజైన్డ్ 17 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి.
2024 హ్యుందాయ్ క్రేటా 5 సీటర్ కేబిన్‌లో యాంబియెంట్ లైటింగ్, 10.25 ఇంచ్ డ్యూయెల్ స్క్రీన్స్, డిజిటల్ క్లస్టర్, అప్పర్ డాష్‌బోర్డ్‌పై పియానో బ్లాక్ ప్యానెల్, మల్టీ స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి వస్తున్నాయి. ఏసీ ప్యానెల్, టచ్ ఆధారిత డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్‌లు కొత్తగా వస్తున్నాయి.
Hyundai Creta facelift on road price in Hyderabad : ఇక ఈ ఎస్‌యూవీలో 360 డిగ్రీ వ్యూ కెమెరా, వయర్లెస్ ఛార్జింగ్, వాయిస్ ఎనేబుల్డ్ వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, వాయిస్ ఎనేబుల్డ్ పానోరమిక్ సన్‌రూఫ్, 8 వే అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీట్, రేర్ విండో కర్టైన్స్, 8 స్పోక్ బోస్ సిస్టెమ్ వంటివి కూడా వస్తున్నాయి.
2024 హ్యుందాయ్ క్రేటా- ఇంజిన్.. సేఫ్టీ ఫీచర్స్..
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 6 స్పీడ్ మేన్యువల్, ఐవీటీ, 7 స్పీడ్ డీసీటీ, 6 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.
ఈ ఎస్‌యూవీలో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్ 2 అడాస్కు చెందిన 19 ఫీచర్స్ ఉంటాయి. మొత్తం మీద చూసుకుంటే.. ఈ 2024 హ్యుందాయ్ క్రేటా ఎస్‌యూవీలో 70కిపైగా సేఫ్టీ ఫీచర్స్ ఉండటం విశేషం. ఇక 6 మోనో టోన్ కలర్ ఆప్షన్స్ ఈ ఎస్‌యూవీకి లభిస్తున్నాయి. ఒక డ్యూయెల్ టోన్ కలర్ కూడా ఉంది.
2024 హ్యుందాయ్ క్రేటా వేరియంట్లు- వాటి ధరలు..
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్‌లో 7 వేరియంట్లు ఉన్నాయి. వాటి ఎక్స్‌షోరూం ధరలు..
హ్యుందాయ్ క్రేటా ఈ (1.5 ఎంపీఐ పెట్రోల్ 6 ఎంటీ)- రూ. 10,99,900.
Hyundai Creta facelift price : ఈఎక్స్ (1.5 ఎంపీఐ పెట్రోల్ 6 ఎంటీ)- రూ. 12,17,700
ఎస్ (1.5 ఎంపీఐ పెట్రోల్ 6 ఎంటీ)- రూ. 13,2,200.
ఎస్ (ఓ) (1.5 ఎంపీఐ పెట్రోల్ 6 ఎంటీ)- రూ. 14,32,400
ఎస్ (ఓ) (1.5 ఎంపీఐ పెట్రోల్ ఐవీటీ)- రూ. 15,82,400
ఎస్ఎక్స్ (1.5 ఎంపీఐ పెట్రోల్ 6 ఎంటీ)- రూ. 15,26,900
ఎస్ఎక్స్ టెక్ (1.5 ఎంపీఐ పెట్రోల్ 6 ఎంటీ)- రూ. 15,94,900
ఎస్ఎక్స్ టెక్ (1.5 ఎంపీఐ పెట్రోల్ ఐవీటీ) - రూ. 17,44,900
ఎస్ఎక్స్ (ఓ) (1.5 ఎంపీఐ పెట్రోల్ 6 ఎంటీ)- రూ. 17,23,800
ఎస్ఎక్స్ (ఓ) (1.5 ఎంపీఐ పెట్రోల్ ఐవీటీ)- రూ. 18,69,800
ఎస్ ఎక్స్ (ఓ) (1.5 టీ-జీడీఐ పెట్రోల్ 7 డీసీటీ)- రూ. 19,99,900
ఈ (1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ 6 ఎంటీ)- రూ. 12,44,900
ఈఎక్స్ (1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ 6 ఎంటీ)- రూ. 13,67,700
2024 Hyundai Creta facelift : ఎస్ (1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ 6 ఎంటీ)- రూ. 14,89,200
ఎస్ (ఓ) (1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ 6 ఎంటీ)- రూ. 15,82,400
ఎస్ (ఓ) (1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ 6 ఏటీ)- రూ. 17,32,400
ఎస్ఎక్స్ టెక్ (1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ 6 ఎంటీ)- రూ. 17,44,900
ఎస్ఎక్స్ (ఓ) (1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ 6 ఎంటీ)- రూ. 18,73,900
ఎస్ఎక్స్ (ఓ) (1.5 యూ2 సీఆర్డీఐ డీజిల్ 6 ఏటీ)- రూ. 19,99,900.
* ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్‌లు మాత్రమే. రానున్న నెలల్లో ఈ హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ ధరలను హ్యుందాయ్ పెంచే అవకాశం ఉంది.