Tata Punch EV : టాటా పంచ్ ఈవీ బుకింగ్స్ షురూ.. వేరియంట్లు- ఫీచర్స్ వివరాలివే!
Tata Punch EV : టాటా పంచ్ ఈవీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ వేరియంట్లు, వాటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Tata Punch EV price in India : మచ్ అవైటెడ్ టాటా పంచ్ ఈవీని రివీల్ చేసింది టాటా మోటార్స్. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ని త్వరలోనే లాంచ్ చేయనుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇక ఇప్పుడు ఈ మోడల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 21వేల టోకెన్ అమౌంట్‌తో సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్ లేదా డీలర్షిప్షోరూమ్స్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్‌ని క్యాన్సిల్ చేసుకున్నా.. డబ్బులు 3,4 రోజుల్లో రీఫ్ అయిపోతాయి. అయితే.. బుకింగ్స్ మొదలైన నేపథ్యంలో టాటా పంచ్ ఈవీ వేరియంట్లు, వాటి కీలక ఫీచర్స్ రివీల్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..
టాటా పంచ్ ఈవీ వేరియంట్లు- వాటి ఫీచర్స్..
టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 5 వేరియంట్లు ఉన్నాయి. అవి.. స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవరడ్+. ఈ పంచ్ ఈవీ.. 4 మోనోటోన్, 5 డ్యూయెల్ టోన్ ఎక్స్టీరియర్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. మోనోటోన్ షేడ్స్ అంటే.. సీవుడ్ గ్రీన్, డేటోనా గ్రే, ఫియర్లెస్ రెడ్, ప్రిస్టీన్ వైట్.
ఇక ఇప్పుడు ఒక్కో వేరియంట్‌తో పాటు దానికి లభిస్తున్న ఫీచర్స్‌ని ఇక్కడ తెలుసుకుందాము..
Tata Punch EV variants : టాటా పంచ్ ఈవీ స్మార్ట్:- కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ బేస్ వేరియంట్ ఇది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్మార్ట్ డిజిటల్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి వస్తున్నాయి. ఇందులో మల్టీ- మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టెమ్ కూడా లభిస్తోంది. సేఫ్టీ విషయానికొస్తే.. ఈ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబులిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) వంటి ఫీచర్స్ ఉంటాయి.
టాటా పంచ్ ఈవీ అడ్వెంచర్:- ఇందులో.. స్మార్ట్ వేరియంట్లోని ఫీచర్స్‌తో పాటు.. ఫ్రెంట్ ఫాగ్ ల్యాంప్స్, ఆప్షనల్ సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్, 17.78సెంటీమీటర్ హర్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, యాపిల్ కార్ప్లే- ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటివి లభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా వస్తున్నాయి.
Tata Punch EV on road price Hyderabad : టాటా పంచ్ ఈవీ- ఎంపవర్డ్:- ఇది మిడ్ రేంజ్ వేరియంట్. ఇందులో అడ్వెంచర్ వేరియంట్లోని ఫీచర్స్‌తో పాటు డ్యూయెల్ టోన్ ఎక్స్టీరియర్ పెయింట్, 16ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఎయిర్ ప్యూరిఫయర్ విత్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, 17.78 సెంటీమీటర్ డిజిటల్ కాక్‌పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 26.03 సెంటీమీటర్ హర్మాన్ టచ్‌స్క్రీన్ హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి లభిస్తున్నాయి. ఆటో ఫోల్డ్ ఓఆర్వీఎం, ఆప్షనల్ సన్‌రూఫ్, ఎస్ఓఎస్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి.
టాటా పంచ్ ఈవీ- ఎంపవర్డ్+ :- ఈ టాటా పంచ్ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్లో లెథరేట్ సీట్స్, వయర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, 26.03 ఇంచ్ డిజిటల్ కాక్‌పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆర్కేడ్.ఈవీ యాడ్ సూట్ వంటివి లభిస్తున్నాయి. బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, 360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉంటుంది.
టాటా పంచ్ ఈవీ ధర ఎంత..?
Tata Punch EV launch date in India : టాటా పంచ్ ఈవీని సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తోంది టాటా మోటార్స్ సంస్థ. ఈ ప్లాట్ఫామ్లో రేంజ్ 300కి.మీలు- 600కి.మీల మధ్యలో ఉంటుంది. ఇక టాటా పంచ్ ఈవీ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా.. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 12లక్షలు- రూ. 14లక్షల మధ్యలో ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
సంబంధిత కథనం