Tata Punch EV : ఇదిగో టాటా పంచ్ ఈవీ.. సూపర్ స్టైలిష్- 300 కి.మీ రేంజ్!
Tata Punch EV first look : టాటా పంచ్ ఈవీ ఫస్ట్ లుక్‌ని టాటా మోటార్స్ రివీల్ చేసింది. స్టైలిష్ లుక్స్‌తో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ అదరగొట్టిందనే చెప్పుకోవాలి.
Tata Punch EV first look : ఆటోమొబైల్ లవర్స్ ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఈవీపై కీలక్ అప్డేట్! ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని అఫీషియల్‌గా విడుదల చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. డిజైన్ సూపర్ స్టైలిష్‌గా, మైండ్ బ్లోయింగ్‌గా ఉందనే చెప్పుకోవాలి! ఈ నేపథ్యంలో ఈ టాటా పంచ్ ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా పంచ్ ఈవీ వచ్చేస్తోంది..
ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన అతి చిన్న ఎస్‌యూవీగా గుర్తింపు తెచ్చుకోనుంది ఈ టాటా పంచ్ ఈవీ. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ కోసం.. సంస్థకు చెందిన సరికొత్త జెన్-2 ప్యూర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించే యోచనలో ఉన్నట్టు టాటా మోటార్స్ చెప్పింది. ఒక వెహికిల్‌కి భారీ మార్పులు చేసి.. ఐసీఈ నుంచి ఈవీకి మార్చడానికి వీలుగా ఈ జెన్-2 ప్యూర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌ని తయారు చేసింది సంస్థ.
అంతేకాకుండా.. ఈ జెన్-2 ప్యూర్ ఈవీ ప్లాట్ఫామ్లో రూపొందించే వెహికిల్స్ రేంజ్ కనిష్ఠంగా 300 కి.మీలు- గరిష్ఠంగా 600 కి.మీల వరకు ఉంటుంది. అంటే.. తక్కువలో తక్కువ వేసుకున్నా.. టాటా పంచ్ ఈవీ రేంజ్ కనీసం 300కి.మీలైనా ఉంటుంది. ఇక కొత్త ఈవీ ప్లాట్ఫామ్లో సెక్యురిటీ ఆర్కిటెక్చర్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా.. టాటా పంచ్ ఐసీఈ ఇంజిన్లానే.. టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌కి కూడా క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ రేటింగ్ వచ్చే అవకాశం ఉంది.
Tata Punch EV launch in India : టాటా పంచ్ ఇప్పిటికే ఐసీఈ వర్షెన్‌లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈవీ వర్షెన్ కూడా లాంచ్ అయితే.. రెండు వర్షెన్లు కలిగిన రెండో టాటా వెహికల్‌గా గుర్తింపు పొందుతుంది ఈ టాటా పంచ్ ఎస్యూవీ. నెక్సాన్‌కు ఇప్పటికే ఐసీఈ, ఎలక్ట్రిక్ వర్షెన్లు ఉన్నాయి. ఇక టాటా టిగోర్‌లో ఐసీఈ, సీఎన్జీ, ఈవీ వర్షెన్లు ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ లాంచ్‌తో మూడు వర్షెన్లు కలిగిన రెండో టాటా వెహికల్‌గా నిలుస్తుంది.
టాటా నెక్సాన్ ఈవీ అప్డేటెడ్ వర్షెన్‌ని గతేడాది లాంచ్ చేసింది టాటా మోటార్స్. దాని స్ఫూర్తితోనే.. టాటా పంచ్ ఈవీని డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. టాటా మోటార్స్ షేర్ చేసిన ఫస్ట్ లుక్‌లో.. టాటా పంచ్ ఈవీకి కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్లిమ్ హెడ్‌లైట్స్, క్లోజ్డ్ గ్రిల్, సరికొత్త అలాయ్ డిజైన్స్ వంటివి ఫ్రెంట్లో వస్తున్నాయి. రేర్‌లో.. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్‌తో పాటు మరిన్ని స్టైలిష్ డిజైన్స్ కనిపిస్తున్నాయి.
Tata Punch EV price in India : టాటా పంచ్ ఈవీలో 5 వేరియంట్లు, 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయని టాక్ నడుస్తోంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉంటాయట.
లాంచ్ ఎప్పుడు..?
వాస్తవానికి ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని గతేడాదే లాంచ్ చేయాల్సి ఉంది. కానీ ఆలస్యమైంది. ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్‌ని సంస్థ అధికారికంగా రివీల్ చేసింది. కానీ లాంచ్ డేట్‌ని ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్ వస్తుందని తెలుస్తోంది.
Tata Punch EV launch date : లాంచ్ తర్వాత.. ఈ టాటా పంచ్ ఈవీ.. సిట్రోయెన్ ఈసీ3 వంటి ఎస్‌యూవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత కథనం