Ather 450 Apex electric scooter : ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్- ధర ఎంతంటే..
Ather 450 Apex electric scooter : ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ధర, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Ather 450 Apex electric scooter : ఏథర్ ఎనర్జీ నుంచి ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యింది. దీని పేరు ఏథర్ 450 అపెక్స్. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్..
ఏథర్ 450 అపెక్స్ ఈ-స్కూటర్లో 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 157 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో వార్ప్ ప్లస్ రైడింగ్ మోడ్ ఉంటుంది. రీజనరేవిట్ బ్రేకింగ్ కోసం మేజిక్ ట్విస్ట్ నెగిటివ్ థ్రాటిల్, ఇండియమ్ బ్లూ పెయింట్ స్కీమ్ వంటివి లభిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే.. ఈ కొత్త స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఏథర్ 450ఎక్స్‌కి నెక్ట్స్ వర్షెన్లా కనిపిస్తుంది.
Ather 450 Apex electric scooter price in India : ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారెంటీ లభిస్తోంది. 5ఏళ్లు లేదా 60,000 కి.మీ వారెంటీ ఇది. ఏథర్ 450ఎక్స్‌లో ఇది 3ఏళ్లు లేదా 30వేల కి.మీలు మాత్రమే ఉంటుంది.
ఏథర్ 450 అపెక్స్ ధర ఎంతంటే..
ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.89లక్షలు. ఏథర్ సంస్థ నుంచి వస్తున్న అతి ఖరీదైన వెహికిల్ ఇదే! ఇందులో 7కేడబ్ల్యూ ఔట్పుట్ ఛార్జర్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 100 కేఎంపీహెచ్. 0-40 కేఎంపీహెచ్ని కేవలం 2.9 సెకన్లలో అందుకుంటుంది ఈ స్కూటర్.
Ather 450 Apex launch : ఈ ఏథర్ 450 అపెక్స్.. ఒక లిమిటెడ్ ఎడిషన్ ఈ-స్కూటర్ అని తెలుస్తోంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2024 మార్చ్‌లో డెలివరీలు మొదలవుతాయని సమాచారం.
Ather 450 Apex price : ఇక ఏథర్ 450 అపెక్స్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఓలా ఎస్ ప్రో, టీవీఎస్ ఎక్స్, సింపుల్ వన్‌కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సంబంధిత కథనం