Ola S1 pro speaker : క్రికెట్ కామెంట్రీ కోసం ఓలా ఎస్1 ప్రో 'స్పీకర్'.. వీడియో వైరల్!
Ola S1 pro speaker viral video : మీ దగ్గర ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందా? అందులోని స్పీకర్‌ను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా! ఈ వీడియోలో అయితే.. ఓలా ఎస్1 ప్రో స్పీకర్‌ను ఏకంగా క్రికెట్ కామెంట్రీ కోసమే వాడేస్తున్నారు..
Ola S1 pro speaker viral video : ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గల్లీ-గల్లీకి ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతునే ఉంటుంది. ప్లేయర్ల అరుపులు, ఫన్నీ కామెంట్రీలతో వీధులు కిటకిటలాడిపోతుంటాయి. ఇలాంటి కామెంట్రీనే ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఇక్కడ కామెంట్రీ హైలైట్ కాదు.. ఆ కామెంట్రీ కోసం ఉపయోగించిన పరికరమే! ఓలా స్కూటర్‌కు ఉన్న స్పీకర్‌తో ఆ క్రికెట్ మ్యాచ్‌లో కామెంట్రీ చెబుతుండటం విశేషం. వివరాల్లోకి వెళితే..
ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీకర్‌తో..
కస్టమర్లకు మంచి అనుభూతిని కలిగించేందుకు ఓలా సంస్థ సైతం నిత్యం కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. ఇక ఇప్పుడు ఓలా ఎస్ 1 ప్రో స్పీకర్లను క్రికెట్ కామెంట్రీ కోసం వాడేశారు.
Ola S1 pro : సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ దృశ్యాలను బికాశ్ బెహెరా అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. ఓలా సీఈఓ భవేష్ అగర్వాల్, ఓలా ఎలక్ట్రిక్‌ను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ఒడిశాకు చెందినదిగా తెలుస్తోంది. స్కూటర్‌కు ఉన్న బ్లూటూత్‌ను ఆ వ్యక్తి ఫోన్‌కు కనెక్ట్ చేశాడు. స్కూటర్ పక్కనే నిలబడి.. ఎదురుగా జరుగుతున్న మ్యాచ్‌కు కామెంట్రీ చెప్పడం మొదలుపెట్టారు. స్పీకర్లో ఆ సౌండ్ చాలా దూరం వరకు వెళ్లింది.
ఈ వీడియోను ఓలా ఫౌండర్, సీఈఓ భవేష్ అగర్వాల్ కూడా షేర్ చేశారు. 'మా వాహనాన్ని అత్యంత క్రియేటివ్‌గా వాడుకున్న వీళ్లే!. ఇలాంటి వాటికోసం బండిని ఉపయోగిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు,' అంటూ ట్వీట్ చేశారు భవేష్. నెటిజన్లు సైతం ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:
కాలేజ్ పార్టీలో..
ఓలా ఎస్ 1 ప్రో స్పీకర్లను ఈ విధంగా వాడుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. కర్ణాటకలోని ఓ కాలేజీలో జరిగిన ఎథ్నిక్ డేలో సైతం.. స్పీకర్‌కు బ్లూటూత్‌ను కనెక్ట్ చేసి మ్యూజిక్ పెట్టుకున్నారు కొందరు స్టూడెంట్స్. ఆ పాటలకు స్టెప్పులేసి ఎంజాయ్ చేశారు.
ఓలాలో ముఖ్యమైన ఫీచర్ వచ్చేసింది..
Ola Electric Scooters MoveOS 3 Update : ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్న వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవ్ఓస్ 3 వచ్చేసింది. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవీశ్ అగర్వార్ వెల్లడించారు. ఇప్పటి వరకు బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఓఎస్.. ఇక Ola S1, Ola S1 Pro యూజర్లందరికీ వచ్చాయి. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు చాలా ఉపయోగకరమైన ఫీచర్లు యాడ్ కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం