2024 Kia Sonet : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!-2024 kia sonet facelift launched check variant wise pricing ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Kia Sonet : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

2024 Kia Sonet : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Jan 12, 2024 11:55 AM IST

2024 Kia Sonet facelift price : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తాజాగా ఇండియాలో లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీలోని వేరియంట్లు, వాటి ధరలను ఇక్కడ తెలుసుకుందాము..

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!
కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

2024 Kia Sonet facelift price : మచ్​ అవైటెడ్​ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని శుక్రవారం లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటర్స్​. ఈ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ధర రూ. 8లక్షలుగా ఉంది. మొత్తం మూడు ట్రిమ్స్​లో అనేక వేరియంట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో 2024 కియా సోనెట్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​..

2020లో తొలిసారి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది కియా సోనెట్​. అప్పటి నుంచి సంస్థకు ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటిగా నిలిచింది. సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో.. ఇండియాలో ఉన్న బీభత్సమైన పోటీని తట్టుకుని మరి, సేల్స్​లో దూసుకెళుతోంది కియా సోనెట్​. ఇందుకు.. సోనెట్​లో ఉన్న ట్రిమ్స్​, వేరియంట్స్​, ఇంజిన్​ ఆప్షన్స్​, ఫీచర్స్​ ముఖ్య కారణం. ఇక 2024 కియా సోనెట్​ లాంచ్​తో.. సేల్స్​ మరింత పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది.

2024 Kia Sonet facelift : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​లో మూడు ట్రిమ్స్​ ఉంటాయి. అవి.. టెక్​ లైన్​, జీటీ లైన్​, ఎక్స్​ లైన్​. ఇక వీటన్నింటిని కలుపుకుంటే.. సోనెట్​లో 19 వేరియంట్లు ఉంటాయి!

2024 కియా సోనెట్​ ఎస్​యూవీలో 3 ఇంజిన్​ ఆప్షన్స్​ ఉంటయి. మొదటిది 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​. ఇది.. 81 బీహెచ్​పీ పవర్​ని, 115 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. దీనికి 5 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది. ఇక రెండోది.. 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​. ఇది 118 హెచ్​పీ పవర్​ని, 170 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. దీనికి.. ఐఎంటీ (సెమీ-ఆటోమెటిక్​) లేదా డీటీసీ గేర్​బాక్స్​లు కనెక్ట్​ అయ్యి ఉంటాయి. ఇక మూడోది.. 1.5 లీటర్​ సీఆర్​డీఐ డీజిల్​ యూనిట్​. ఇది 114 హెచ్​పీ పవర్​ని, 250 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ ఐఎంటీ, 6 స్పీడ్​ ఏటీ గేర్​బాక్స ఆప్షన్స్​ ఉంటాయి.

2024 కియా సోనెట్​ వేరియంట్లు- వాటి ధరల వివరాలు..

2024 కియా సోనెట్​ ట్రిమ్స్​ వేరియంట్స్​ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ధరలు
    
Smartstream G1.25MTHTE7,99,000
  HTK8,79,000
  HTK+9,89,900
Smartstream G1.0T-GDi iMTHTK+10,49,000
  HTX1,149,000
  HTX+1,339,000
 7DCTHTX1,229,000
  GTX+1,449,900
  X-line1,469,000
1.5L CRDi VGT6MTHTE979,000
  HTK1,039,000
  HTK+1,139,000
  HTX

1,199,000

  HTX+1,369,000
 

6iMT

HTX1,259,900
  HTX+1,439,000
 6AT HTX1,299,000
  GTX+1,549,900
  X-line15,69,000

2024 Kia Sonet specs : 25,000. ఆ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం