Kia Sonet facelift vs Tata Nexon : ఈ రెండు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​లో ఏది బెస్ట్​?-kia sonet facelift vs tata nexon facelift feature and price compared ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Sonet Facelift Vs Tata Nexon : ఈ రెండు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​లో ఏది బెస్ట్​?

Kia Sonet facelift vs Tata Nexon : ఈ రెండు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Dec 15, 2023 01:20 PM IST

Kia Sonet facelift vs Tata Nexon : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్సెస్​ టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్.. ఈ రెండింట్లో ఏది బెస్ట్​?

ఈ రెండు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​లో ఏది బెస్ట్​?

Kia Sonet facelift vs Tata Nexon facelift : కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సంస్థ అధికారికంగా రివీల్​ చేసింది. ఈ మోడల్​.. ఇండియాలోనే బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​కి గట్టి పోటీనివ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్సెస్​ టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​- లుక్స్​..

కియ సోనెట్​ ఫేస్​లిఫ్ట్​లో స్కల్ప్​టెడ్​ బానెడ్​, ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ విత్​ రీడిజైన్డ్​ డీఆర్​ఎల్స్​, స్కిడ్​ ప్లేట్​తో కూడిన రిఫ్రెష్డ్​ బంపర్స్, కెమెరాతో కూడిన ఓఆర్​వీఎంలు, 16 ఇంచ్​ డ్యూయెల్​ టోన్ వీల్స్​, కనెక్టెడ్​ టైప్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​​​ వంటివి వస్తున్నాయి.

ఇక 2023 టాటా నెక్సాన్​లో బ్లాక్​డ్​-ఔట్​ గ్రిల్​, బంపర్​ మౌంటెడ్​ ప్రొజెక్టర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, సీక్వెన్షియల్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఫ్లైర్డ్​ వీల్​ ఆర్చీస్, కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, 16 ఇంచ్​ డైమెండ్​ కట్​ వీల్స్​ ఉంటాయి.

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్సెస్​ టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​- ఫీచర్స్​..

Kia Sonet facelift 2024 price : 2024 కియా సోనెట్​ ఎస్​యూవీ 5 సీటర్​ కేబిన్​లో పవర్డ్​ డ్రైవింగ్​ సీట్​, ప్రీమియం లెథరెట్​ అప్​హోలిస్ట్రీ, ఎయిర్​ ప్యూరిఫయర్​, వెంటిలేటెడ్​ సీట్స్​, మూడ్​ లైటింగ్​, 6ఎయిర్​బ్యాగ్స్​, బోస్​ సౌండ్​ సిస్టెమ్​, 360 డిగ్రీ వ్యూ కెమెరా, ఏడీఏఎస్​ వంటివి ఉంటాయి.

మరోవైపు టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ కేబిన్​లో లెథరెట్​ అప్​హోలిస్ట్రీ, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, వాయిస్​ అసిస్టెడ్​ సన్​రూఫ్​, టచ్​- సెన్సిటివ్​ ఏసీ కంట్రోల్స్​, 6 ఎయిర్​బ్యాగ్స్​ లభిస్తున్నాయి.

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్సెస్​ టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​- ఇంజిన్​..

కియా సోనెట్​ కొత్త వర్షెన్​లో 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​, 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 5 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ మేన్యువల్​, ఐఎంటీ, టార్క్​- కన్వర్ట్​ ఆటోమెటిక్​, 7 స్పీడ్​ జీఎస్​జీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

Tata Nexon facelift price : 2023 టాటా నెక్సాన్​లో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ టర్బో డీజిల్​ ఇంజిన్​లు ఉన్నాయి. మేన్యువల్​, ఏఎంటీ, డీసీఏ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉంటాయి.

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ వర్సెస్​ టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​- ధరలు..

2024 కియా సోనెట్​ ఎక్స్​షోరూం ధర రూ. 8లక్షలు- రూ. 16లక్షల మధ్యలో ఉండొచ్చు. ఇక టాటా నెక్సాన్​ కొత్త వర్షెన్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.1లక్షలు- రూ. 15.5లక్షల మధ్యలో ఉంటుంది.

సంబంధిత కథనం