Tata Nexon facelift vs Maruti Suzuki Brezza : టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యింది. మారుతీ సుజుకీ బ్రెజాకు ఇది గట్టిపోటీనిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మైలేజ్‌ను పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
రెండు ఎస్‌యూవీలకు సంబంధించిన ఏఆర్ఏఐ ఫ్యూయెల్ ఏఫీషియెన్సీ డేటా బయటకు వచ్చింది. వివిధ వేరియంట్లు, వాటి మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.
అంటే.. పెట్రోల్ వేరియంట్ విషయానికొస్తే.. టాటా నెక్సాన్ కన్నా మారుతీ సుజుకీ బ్రెజా ఎక్కువ మైలేజ్ ఇస్తుందని అర్థం. వాస్తవానికి.. మారుతీ సుజుకీకి చెందిన అనేక మోడల్స్.. ఇతర వాహనాల కన్నా ఎక్కువ రేంజ్‌ని ఇస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మారుతీ సుజుకీ బ్రెజాలో 1.5 లీటర్, 4 సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇక టాటా నెక్సాన్‌లో 1.2 లీటర్, 3 సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
ఇప్పుడు.. టాటా నెక్సాన్‌ను మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌తో పోల్చుదాము :
ఫ్రాంక్స్‌లో 1.2 లీటర్, 4 సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 100హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
సంబంధిత కథనం