Tata Nexon vs Kia Seltos : 2023 టాటా నెక్సాన్ వర్సెస్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్- ఏది బెస్ట్?
2023 Tata Nexon vs Kia Seltos : 2023 టాటా నెక్సాన్ వర్సెస్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్.. ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
2023 Tata Nexon vs Kia Seltos : 2023 టాటా నెక్సాన్‌ను ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. 2023 కియా సెల్టోస్తో ఉన్న పోటీని మరింత పెంచే విధంగా ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఎస్యూవీ డీజైన్, లుక్స్ ఇవే..
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో బంపర్ మౌంటెడ్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్ప్లిట్ టైప్ సీక్వెన్షియల్ డీఆర్ఎల్స్, అడాప్టివ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, స్కిడ్ ప్లేట్స్, స్లీక్ రూఫ్ రెయిల్స్, కనెక్టెడ్ టైప్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, మోటిఫ్, 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ వీల్స్ వస్తున్నాయి.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో టైగర్ నోస్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్తో కూడిన స్లీక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, బంపర్ మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్స్, ఆటో- ఫోల్డింగ్ ఓఆర్వీఎంలు, కనెక్టెడ్ టైప్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, 18 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి.
ఈ రెండు ఎస్‌యూవీల ఫీచర్స్ ఇవే..
Tata Nexon facelift price : టాటా నెక్సాన్ స్పెషియస్ సీటర్ కేబిన్‌లో ఇండిగో కలర్ లెథరేట్ అప్‌హోలిస్ట్రీ, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వయర్లెస్ ఛార్జర్, బాక్లిట్ టచ్ ఏసీ కంట్రోల్స్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, లోగో, 6 ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తున్నాయి.
ఇక కియా బెస్ట్ సెల్లింగ్ మోడల్లో లెథరెట్ అప్‌హోలిస్ట్రీ, వాయిస్ కంట్రోల్డ్ పానారోమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, బాస్ సౌండ్ సిస్టెమ్, డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్, లెవల్ 2 ఏడీఏఎస్ సెటప్ ఉంటాయి.
ఇదీ చూడండి:- Tata Nexon EV vs Mahindra XUV400 : ఈ రెండు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఏది బెస్ట్?
ఈ రెండు ఎస్‌యూవీల్లో ఉండే ఇంజిన్ వివరాలు..
2023 టాటా నెక్సాన్‌లో 1.5 లీటర్ టర్బో డీజిల్ మోటార్ ఉంటుంది. ఇది 113 హెచ్‌పీ పవర్‌ను, 260 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 118 హెచ్‌పీ పవర్‌ను, 170 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
2023 Kia Seltos price Hyderabad : మరోవైపు కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 113.4 హెచ్‌పీ పవర్‌ను, 144 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ మోటార్.. 113.4 హెచ్‌పీ పవర్‌ను, 250ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 160 హెచ్‌పీ పవర్‌ను, 253 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఐఎంటీ, 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ, డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ వస్తున్నాయి.
ఈ రెండు వాహనాల ధరలు ఎంతంటే..
Tata Nexon on road price Hyderabad : ఇండియాలో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌షోరూం ధర రూ. 8.1లక్షలు- రూ. 13లక్షల మధ్యలో ఉంటుంది. ఇక 2023 కియా సెల్టోస్ ఎక్స్‌షోరూం ధర రూ. 10.9లక్షలు రూ. 20లక్షల మధ్యలో ఉంటుంది.
సంబంధిత కథనం