Punch iCNG vs Fronx CNG : టాటా పంచ్ వర్సెస్ మారుతీ ఫ్రాంక్స్.. ఏ సీఎన్జీ మోడల్ బెస్ట్?
Tata Punch iCNG vs Maruti Suzuki Fronx CNG : టాటా పంచ్ ఐసీఎన్జీ వర్సెస్ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ సీఎన్జీ.. ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
Tata Punch iCNG vs Maruti Suzuki Fronx CNG : టాటా పంచ్ సీఎన్జీ మోడల్‌ను ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. ఈ మోడల్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ సీఎన్జీకి గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
వీటి ఫీచర్స్ వివరాలు ఇవే..
టాటా పంచ్ ఐసీఎన్జీలో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ వస్తోంది. రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్, 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటివి లభిస్తున్నాయి. వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ ఫీచర్ అట్రాక్టివ్‌గా ఉంది. డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ స్వే కంట్రోల్, కార్నర్ స్టెబులిటీ కంట్రోల్‌లు వస్తున్నాయి.
Tata Punch iCNG on road price Hyderabad : మరోవైపు మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌లో ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్, ఫోల్డెబుల్ ఓఆర్వీఎంలు, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్, కార్ప్లే, ఏఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటివి లభిస్తున్నాయి.
ఇదీ చూడండి:- Hyundai Exter CNG vs Tata Punch iCNG : ఎక్స్టర్ వర్సెస్ పంచ్- సీఎన్జీ మోడల్స్‌లో ఏది బెస్ట్?
వీటి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఇవే..
టాటా పంచ్ ఐసీఎన్జీలో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. సీఎన్జీ మోడ్‌లో ఇది 72.5 హెచ్‌పీ పవర్‌ను, 103 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తోంది. ఈ మోడల్ మైలేజ్.. 26.99 కి.మీ/కేజీ అని సంస్థ చెబుతోంది.
Maruti Suzuki Fronx CNG on road price Hyderabad : కాగా ఈ టాటా కారులో 1 పెద్ద సిలిండర్ బదులు.. రెండు చిన్న సిలిండర్లు ఉంటాయి. ఫలితంగా బూట్ స్పేస్ సాధారణ సీఎన్జీ కార్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది.
ఇక మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ సీఎన్జీలో 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 76 హెచ్‌పీ పవర్‌ను, 98.5 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులోనూ 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తోంది. ఈ మోడల్.. 28.51 కి.మీ/ కేజీ మైలేజ్ ఇస్తుంది.
వీటి ధరలెంతంటే..
Tata Punch iCNG price : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌కి రెండు సీఎన్జీ వేరియంట్లే ఉన్నాయి. వాటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 8.41లక్షలు, రూ. 9.28లక్షలు. మరోవైపు టాటా పంచ్ ఐసీఎన్జీ ఎక్స్‌షోరూం ధరలు రూ. 7.10లక్షల నుంచి రూ. 9.68లక్షల మధ్యలో ఉంటుంది.
సంబంధిత కథనం