Most affordable CNG cars : దేశంలో అత్యంత చౌకైన సీఎన్జీ కార్లు ఇవే..
Most affordable CNG cars in India : మీరు ఓ సీఎన్జీ కారును తీసుకోవాలని చూస్తున్నారా? దేశంలో అందుబాటులో ఉన్న చౌకైన సీఎన్జీ మోడల్స్ లిస్ట్‌ను ఇక్కడ చూడండి..
Most affordable CNG cars in India : సీఎన్జీ ధరలు ఇటీవలే తగ్గాయి. ఇప్పటికే మంచి డిమాండ్ ఉన్న సీఎన్జీ వాహనాల మోడల్స్‌కు ఇది మరో సానుకూల విషయం. ఈ నేపథ్యంలో మీరు కూడా ఓ సీఎన్జీ కారును తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? దేశంలో అత్యంత చౌకైన సీఎన్జీ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ ఆల్టో 800 సీఎన్జీ..
Maruti Suzuki Alto 800 CNG price : ఆల్టో 800 ప్రొడక్షన్‌ను మారుతీ సుజుకీ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే సీఎన్జీ మోడల్ స్టాక్ ఉన్నంత కాలం కొనుగోలు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 5.13లక్షలు. దీని మైలేజ్ కేజీకి 30కి.మీలు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సీఎన్జీ మోడల్స్‌లో ఈ రేంజ్ మైలేజ్ ఇస్తున్న అతి తక్కువ వాహనాల్లో ఈ మోడల్ ఒకటి. ఈ ఇంజిన్ 40 బీహెచ్పీ పవర్‌ను, 60 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో సీఎన్జీ..
Maruti Suzuki S Presso CNG on road price in Hyderabad : మారుతీ సుజుకీ నుంచి మరో చౌకైన సీఎన్జీ కారు ఈ ఎస్-ప్సెస్సో. ఇందులో న్యూ జెన్ సీఎన్జీ కిట్ ఉంటుంది. ఎల్ఎక్స్ఐ వేరియంట్లో సీఎన్జీ అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 బీహెచ్పీ పవర్‌ను 82 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేజీకి 32కి.మీల మైలేజ్ దీని సొంతం. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలు.
మారుతీ సుజుకీ ఆల్టో కే10..
Alto K10 CNG price : కే10 హ్యచ్బ్యాక్కు సీఎన్జీ టచ్ ఇచ్చింది మారుతీ సుజుకీ. ఇందులో 1.0 లీటర్ కే10 సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 బీహెచ్పీ పవర్‌ను, 82ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేజీకి 34కి.మీల మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 5.96లక్షలు.
మారుతీ సుజుకీ వాగన్ఆర్..
WagonR CNG on road price in Hyderabad : దేశంలో మంచి డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్ మోడల్స్‌లో వాగన్ఆర్ ఒకటి. దీని సీఎన్జీ మోడల్‌కు అదే విధంగా దూసుకెళుతోంది. ఇందులో 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 బీహెచ్పీ పవర్‌ను, 82ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేజీకి 34.05కి.మీల మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 6.43లక్షలు.
టాటా టియాగో ఐసీఎన్జీ..
Tata Tiago iCNG mileage : టాటా టియాగో ఐసీఎన్జీలో 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 బీహెచ్పీ పవర్‌ను, 95 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేజీకి 26.49కి.మీల మైలేజ్ దీని సొంతం. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 6.44లక్షలు.
సంబంధిత కథనం