Top EV's under 25 Lakh : రూ. 25లక్షల బడ్జెట్ రేంజ్లో.. బెస్ట్ ఈవీలు ఇవే!
Top EV's under 25 Lakh : ఇండియా ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ దూసుకెళుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్లో దాదాపు అన్ని సంస్థల ఈవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రూ. 25లక్షల బడ్జెట్లోపు ది బెస్ట్ ఈవీల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
దేశంలో అతి తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో టాటా టియాగో ఈవీ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 8.69లక్షలు. ఇందులో 19.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 250కి.మీల దూరం ప్రయాణించవచ్చు. 24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 315కి.మీల దూరం వెళ్లొచ్చు.(HT AUTO)
(2 / 5)
టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ ఈసీ3 ఇటీవలే లాంచ్ అయ్యింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11.5లక్షలు. ఇందులోని 29.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 320కి.మీల దూరం ప్రయాణించవచ్చు.(HT AUTO)
(3 / 5)
మహీంద్రా ఎక్స్‌యూవీ400కి డిమాండ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 16లక్షలు. ఇందులో 39.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 456కి.మీల దూరం వరకు ప్రయాణించవచ్చు.(HT AUTO)
(4 / 5)
ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్‌ను రారాజుగా నిలిపిన మోడల్స్‌లో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 16.49లక్షలు. ఇందులోని 40.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 437కి.మీలు ప్రయాణించవచ్చు.(HT AUTO)
ఇతర గ్యాలరీలు