2022 WagonR | మారుతీ సుజుకీ వాగన్ఆర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. మైలేజ్ హైక్-2022 maruti suzuki wagonr launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2022 Wagonr | మారుతీ సుజుకీ వాగన్ఆర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. మైలేజ్ హైక్

2022 WagonR | మారుతీ సుజుకీ వాగన్ఆర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్.. మైలేజ్ హైక్

HT Telugu Desk HT Telugu
Feb 28, 2022 02:21 PM IST

మారుతీ సుజుకీ తన పాపులర్ మోడల్ వాగన్ఆర్‌కు సంబంధించి లేటెస్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో దీని ప్రారంభ ధర రూ.5.4 లక్షలుగా నిర్దేశించింది. ఈ సరికొత్త వాహనంలో క్రితం మోడల్ కంటే కూడా మైలేజి పెరిగింది.

<p>మారుతీ సుజుకీ వాగన్ఆర్&nbsp;</p>
మారుతీ సుజుకీ వాగన్ఆర్ (Company official site)

ప్రముఖ వాహన సంస్థ మారుతీ సుజుకీ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసు పెట్టి తన వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తోంది. గతేడాది తన సెలెరియో మోడల్‌ లేటెస్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. ఇటీవలే బాలెనో మోడల్‌ను విపణిలోకి వదిలింది. తాజాగా తన వాగన్ఆర్ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ 2022 వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ. 5.4 లక్షలుగా నిర్దేశించింది. ఈ సరికొత్త వాహనంలో పాత మోడల్ కంటే మరిన్నీ అప్డేట్లను పొందుపరిచారు.

అంతేకాకుండా ఈ 2022 మారుతీ సుజుకీ వాగన్ ఆర్ కారు గల్లాండ్ రెడ్-బ్లా రూఫ్, మాగ్మాగ గ్రే-బ్లాక్ రూఫ్ రంగుల్లో లభ్యమవుతుంది. ఈ మార్పులు కాకుండా గ్రే మెలాంజ్ ఫ్యాబ్రిక్ డిజైన్ సీట్లను ఇందులో పొందుపరిచారు. వివిధ వేరియంట్లలో లభ్యమవుతోన్న ఈ వాహనం కనీస ధర రూ.5.4 లక్షలు అయితే గరిష్ఠంగా రూ.7.1(టాప్ వేరియంట్) లక్షల వరకు ఉంది.

ఫీచర్లు..

ఈ సరికొత్త మారుతీ సుజుకీ వాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఫీచర్లకు కొరతే లేదు. 7-అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో, స్మార్ట్ ఫోన్ నేవిగేషన్, నాలుగు స్పీకర్ల సదుపాయం, క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ వ్యవస్థ, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కాకుండా కీ లెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, ఏసీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం లాంటి తదితర అదనపు ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.

ఇంజిన్..

ఈ 2022 వాగన్ఆర్ వెర్షన్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 66 బీహెచ్‌పీ బ్రేక్ హార్స్ పవర్, 89 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 5-మ్యానువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుండా లీటరుకు గరిష్ఠంగా 25.19 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. క్రితం మోడల్‌తో పోలిస్తే మైలేజీ 16 శాతం పెరిగింది. ఇందులో 1.0-లీటర్ సీఎన్జీ పవర్టెయిన్ కూడా ఉంది. ఇది కూడా 56 బీహెచ్‌పీ బ్రేక్ హార్స్ పవర్, 82 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా లీటరుకు గరిష్ఠంగా 34.05 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

ఈ వాహనంలో ఉన్న మరో ఇంజిన్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్. ఈ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ 88.5 బీహెచ్‌పీ బ్రేక్ హార్స్ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా లీటరుకు గరిష్ఠంగా 24.43 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. క్రితం మోడల్‌తో పోలిస్తే 19 శాతం పెరిగింది.

 

Whats_app_banner

సంబంధిత కథనం