Alto 800 discontinued : ఆల్టో 800కు మారుతీ సుజుకీ గుడ్ బై.. ప్రొడక్షన్ నిలిపివేత..!
Maruti Suzuki Alto 800 discontinued : మారుతీ సుజుకీ ఆల్టో 800 ప్రొడక్షన్ నిలిచిపోయింది. ఈ మోడల్‌ను డిస్కంటిన్యూ చేయాలని సంస్థ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Maruti Suzuki Alto 800 discontinued : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన 'ఆల్టో 800'కు మారుతీ సుజుకీ గుడ్ బై చెప్పేసినట్టు తెలుస్తోంది! ఈ మోడల్ ప్రొడక్షన్ ఇప్పటికే నిలిచిపోయినట్టు.. ఆల్టో 800ను సంస్థ డిస్కంటిన్యూ చేసేసినట్టు సమాచారం.
కారణాలు ఇవే..!
మారుతీ సుజుకీ పోర్ట్‌ఫోలియోలోని హ్యాచ్‌బ్యాక్ మోడల్స్‌లో ఈ ఆల్టో 800కి అత్యధిక సేల్స్ నెంబర్లు ఉండేవి. కానీ.. బీఎస్6 ఫేజ్ 2 నార్మ్స్కు తగ్గట్టుగా ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేస్తే.. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని మారుతీ సుజుకీ భావించినట్టు తెలుస్తోంది. అందుకే ప్రొడక్షన్‌ను కూడా నిలిపివేసినట్టు సమాచారం.
Maruti Suzuki Alto 800 latest news : ఈ వ్యవహారంపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు మారుతీ సుజుకీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ.
"ఆల్టో 800 ఒక ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్. ఈ సెగ్మెంట్లో కార్యకలాపాలు, సేల్స్ ప్రతియేటా తగ్గిపోతున్నాయి. మోడల్స్ ధరలు పెరగడంతో వాల్యూమ్స్ పడిపోయాయి. ధరలు పెరుగుతున్నంతగా.. కస్టమర్ల సంఖ్య పెరగడం లేదు. అదే సమయంలో ఆల్టో కే10కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. అందుకే ఆల్టో 800ని డిస్కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాము," అని శ్రీవాస్తవ వెల్లడించారు.
బై.. బై.. ఆల్టో 800..!
Maruti Suzuki Alto 800 : ఆల్టో 800 తప్పుకోవడంతో.. మారుతీ సుజుకీకి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌గా కే10 నిలువనుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 3.99లక్షలు- రూ. 5.94లక్షల మధ్యలో ఉంటుంది. కాగా.. మారుతీ సుజుకీ ఆల్టో 800 ఎక్స్‌షోరూం ధర రూ. 3.54లక్షలు- రూ. 5.13లక్షల మధ్యలో ఉండేది.
Maruti Suzuki Alto 800 on road price in Hyderabad : మారుతీ సుజుకీ ఆల్టో 800లో 796సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 48 పీఎస్ పవర్‌ను, 69 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 2000లో ఇది ఇండియాలో లాంచ్ అయ్యింది. 2010 నాటికి.. మొత్తం మీద 18,00,000 ఆల్టో 800 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆల్టో కే10 ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయం నుంచి ఇప్పటివరకు.. 17,00,000 ఆల్టో 800 యూనిట్లను, 9,50,000 ఆల్టో కే10 కార్లను విక్రయించింది.
దేశప్రజలకు.. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ ఆల్టో 800తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందరో ప్రజలు.. తమ తొలి కారుగా దీనిని కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం