Cars discontinued in 2022 : ఈ ఏడాది.. ఇండియా మార్కెట్లో నుంచి మాయమైపోయిన కార్లు ఇవే!
List of cars discontinued in 2022 in India : 2022లో చాలా కార్లు డిస్కంటిన్యూ అయిపోయాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము.
List of cars discontinued in 2022 in India : 2022లో కొత్త లాంచ్‌లు, ఫేస్‌లిఫ్ట్ వర్షెన్లతో ఆటో పరిశ్రమ కళకళలాడిపోయింది. కొత్త మోడల్స్ రాకతో పాత వర్షెన్లకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ క్రమంలో ఎన్నో సంస్థలు పలు మోడల్స్‌ను డిస్కంటిన్యూ కూడా చేసేశాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మోడల్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. 2022లో ఇండియా రోడ్ల మీద మాయమైపోయిన కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము..
మారుతీ ఎస్-క్రాస్..
Maruti S cross discontinued : గ్రాండ్ విటారా ఎంట్రీతో ఎస్-క్రాస్‌కు గుడ్ బై చెప్పేసింది మారుతీ. ఈ ఎస్-క్రాస్.. ఎస్యూవీ కన్నా క్రాసోవర్గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి ఓ పెద్ద హ్యాచ్‌బ్యాక్ మోడల్‌గా ఇది కనిపించేది. 2015లో ఇండియా మార్కెట్లోకి లాంచ్ అయ్యింది ఈ మారుతీ ఎస్-క్రాస్. 1.3 లీటర్, 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్స్ ఉండేవి. కొంత కాలానికి 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేసింది ఆ సంస్థ. ఈ వెహికిల్‌కి చాలా ఫేస్‌లిఫ్ట్ , అప్‌గ్రేడ్ వర్షెన్స్ కూడా వచ్చాయి. ఈ ఏడాదిలో ఎస్- క్రాస్ మొత్తానికే డిస్కంటిన్యూ అయిపోయింది. అంతకుముందు.. దీని ధర రూ. 8.95లక్షలు- 12.92లక్షల మధ్యలో ఉండేది.
వోక్స్వ్యాగన్ పోలో..
Volkswagen Polo discontinued : ఇండియాలో 2010లో లాంచ్ అయిన వోక్స్వ్యాగన్ పోలోకు మంచి డిమాండ్ కనిపించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పోలో ప్రసిద్ధి చెందింది. 12ఏళ్ల పాటు ఎన్నో అప్‌గ్రేడ్స్ కూడా పొందింది. చౌకైన ధరలో ప్రీమియం ఫీచర్స్‌లో అందుబాటులో ఉన్న వెహికిల్‌గా ఇది గుర్తింపు పొందింది. ఇందులో 1లీటర్ టర్బో-పెట్రోల్ టీఎస్ఐ ఎంటీ/ఏటీ వేరియంట్ ఇంజిన్ ఉండేది. డిస్కంటిన్యూకు ముందు దీని ధర రూ. 6.45లక్షలు- రూ. 10.25లక్షల మధ్యలో ఉండేది.
అయితే.. భవిష్యత్తులో సరికొత్త అవతారంలో వోక్స్వ్యాగన్ పోలోను ఆ సంస్థ మళ్లీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
వోక్స్వ్యాగన్ వెంటో..
Volkswagen Vento : పోలోకు సెడాన్ మోడల్‌గా గుర్తింపు పొందిన వోక్స్వ్యాగన్ వెంటో కూడా ఈ ఏడాది మాయమైపోయింది. 2010లో 1 లీటర్ టర్బో పెట్రోల్ టీఎస్ఐ ఎంటీ/ఏటీ ఇంజిన్‌తో ఇది లాంచ్ అయ్యింది. 12ఏళ్లల్లో ఎన్నో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్స్ వచ్చాయి. డిస్కంటిన్యూకు ముందు దీని ధర రూ. 9.99లక్షలు- 14.79లక్షల మధ్యలో ఉండేది.
రెనాల్ట్ డస్టర్..
Renault Duster discontinued in India : 2012లో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌కు ఎస్యూవీ సెగ్మెంట్లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఎంటీ/సీవీటీ- 1.5 లీటర్ పెట్రోల్ ఎంటీ ఇంజిన్ వేరియంట్స్ ఉండేవి. డిస్కంటిన్యూకి ముందు దీని ధర రూ. 9.86లక్షలు- రూ. 14.25లక్షల మధ్యలో ఉండేది. అయితే.. అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టేందుకు రెనాల్ట్ డస్టర్ కొత్త వర్షెన్ సిద్ధమవుతోందని సమాచారం. ఇండియాలో మాత్రం అది రాకపోవచ్చు!
హ్యుందాయ్ సాంట్రో..
Hyundai Santro discontinued in India : ఇండియా మార్కెట్లోకి హ్యుందాయ్ సాంట్రో 2018లో తిరిగి వచ్చింది. కానీ అదృష్టం వరించలేదు! నాలుగేళ్ల తర్వాత.. ఈ కారును హ్యుందాయ్ ఈ ఏడాది మళ్లీ డిస్కంటిన్యూ చేసేసింది. ఇందులో 1.1 లీటర్ పెట్రోల్ ఎంటీ/ఏఎంటీ ఇంజిన్ ఉండేది. డిస్కంటిన్యూకి ముందు దీని ధర రూ. 4.90లక్షలు- 6.42లక్షల మధ్యలో ఉండేది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్- ఆరా డీజిల్..
Hyundai Grand i10 Nios : హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్- ఆరా డీజిల్ కార్లు మంచి మైలేజ్‌ని ఇచ్చేవి. కానీ ఇవి డిస్కంటిన్యూ అయిపోవడం నిజంగా బాధ కలిగించే విషయమే. 2019లో మార్కెట్లోకి అడుగుపెట్టిన నియోస్‌లో 1.2లీటర్ డీజిల్ ఎంటీ/ఏఎంటీ ఇంజిన్ ఉండేది. 2020లో వచ్చిన ఆరాలోనూ ఇదే ఉండేది. నియోస్ ధర రూ. 7.85లక్షలు- 8.46లక్షల మధ్యలో ఉండేది. ఇక ఆరా డీజిల్ ధర 8.06లక్షలు- రూ. 9.51లక్షల మధ్యలో ఉండేది.
డాట్సన్ కార్లు..
Datsun Redi-Go, Go, Go Plus : మూడు మోడల్స్‌ను ఈ ఏడాది నిలిపివేసింది డాట్సన్. అవి.. డాట్సన్ రెడి-గో, గో, గో ప్లస్. అంతర్జాతీయంగా కూడా ఈ బ్రాండ్ మాయమైపోనుంది. వాస్తవానికి.. 2014 లాంచ్ సమయం నుంచి ఈ మూడు మోడల్స్ కూడా ఇండియాలో పెద్దగా అమ్ముడుపోలేదు. లాంచింగ్ సమయంలో.. ది మోస్ట్ అఫార్డిబుల్ 7 సీటర్ వెహికిల్‌గా గుర్తింపు పొందింది గో ప్లస్. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. వీటిల్లో 0.8లీటర్ పెట్రోల్, 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండేవి. ధర రూ. 3.98లక్షలు- రూ. 7లక్షల మధ్యలో ఉండేది.
మహీంద్రా ఆల్టూరస్ జీ4..
Mahindra Alturas G4 discontinued : ఈ మహీంద్రా ఎస్యూవీ సేల్కు అందుబాటులో లేదు. 2018లో లాంచ్ అయిన ఈ మోడల్లో 2.2లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండేది. ఫీచర్స్ గొప్పగానే ఉన్నా.. ఎందుకో ఈ ఎస్యూవీ క్లిక్ అవ్వలేదు. అదే సమయంలో ఎక్స్యూవీలతో మహీంద్రా బిజీ అయిపోయింది. చివిరికి.. ఈ ఆల్టూరస్ జీ4.. 2022లో మాయమైపోయింది. దీని ధర రూ. 30.68లక్షలుగా ఉండేది.
సంబంధిత కథనం