Offers on Renault cars : క్విడ్​, ట్రైబర్​.. రెనాల్ట్​ వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!-renault india announces offers of up to 60 000 on its cars check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Renault India Announces Offers Of Up To 60,000 On Its Cars, Check Full Details

Offers on Renault cars : క్విడ్​, ట్రైబర్​.. రెనాల్ట్​ వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 03, 2022 08:04 AM IST

Offers on Renault cars : క్విడ్​,ట్రైబర్​, కైగర్​.. ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది రెనాల్ట్​ ఇండియా. ఆ వివరాలు..

ఈ రెనాల్ట్​ వాహనాలపై భారీ డిస్కౌంట్లు..
ఈ రెనాల్ట్​ వాహనాలపై భారీ డిస్కౌంట్లు..

Offers on Renault cars : ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​తో ఆటో సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాహనాల ధరల్లో డిస్కౌంట్లు ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి రెనాల్ట్​ కూడా చేరింది. తమ కంపెనీకి చెందిన పలు వాహనాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్టు రెనాల్ట్​ ఇండియా ప్రకటించింది. వీటిపై ఓ లుక్కేద్దాం..

ట్రెండింగ్ వార్తలు

రెనాల్ట్​ క్విడ్​..

Discounts on Renault Kwid : రెనాల్ట్​ క్విడ్​పై క్యాష్​ బోనస్​ కింద రూ. 10వేల వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్(ఆర్​ఎక్స్​ఈ మినహాయించి)​ కింద రూ. 15వేలు తగ్గుతోంది. కార్పొరేట్​ డిస్కౌంట్​తో మరో రూ. 10వేలు దిగొస్తుంది. ఎంట్రీ లెవల్​ హ్యాచ్​బ్యాక్​ మోడల్​పై స్క్రాపేజ్​ బెనిఫిట్స్​ రూపంలో మరో రూ. 10వేల ఆఫర్​ ఇస్తోంది రెనాల్ట్​.

ఇక రెనాల్ట్​ క్విడ్​ ధర రూ. 4.64లక్షలు- 5.99లక్షల మధ్యలో ఉంది.

Offers on Honda cars : హోండా వాహనాలపైనా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

రెనాల్ట్​ ట్రైబర్​..

Offers on Renault Triber : రెనాల్ట్​ ట్రైబర్​పై రూ. 15వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​, కార్పొరేట్​ డిసకౌంట్​, స్క్రాపేజ్​ పాలసీలతో వరుసగా రూ. 25వేలు, రూ. 10వేలు, రూ. 10వేలు తగ్గుతుంది.

రెనాల్ట్​ ట్రైబర్​ ధర రూ. 5.92లక్షలు- రూ. 8.51లక్షల మధ్యలో ఉంది.

రెనాల్ట్​ కైగర్​..

Renault Kiger price discounts : రెనాల్ట్​ కైగర్​ మీద డిసెంబర్​లో ఎలాంటి క్యాష్​ బోనస్​లు లేవు. ఆర్​ఎక్స్​ఈ మినహాయించి.. అన్ని వేరియంట్లపై రూ. 15వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​ లభిస్తుంది. కార్పొరేట్​ బోనస్​ కింద మరో రూ. 10వేలు దిగొస్తుంది. అయితే.. కైగర్​ మీద రూ. 10వేలు విలువ చేసే 2ఏళ్ల వారెంటీని ఉచితంగా ఇస్తోంది రెనాల్ట్​.

రెనాల్ట్​ కైగర్​ ధర రూ. 5.99లక్షలు- రూ. 10.62లక్షల మధ్యలో ఉంటుంది.

* రూరల్​ డిస్కౌంట్​ పేరుతో అన్ని మోడళ్లపై రూ. 5వేల డిస్కౌంట్​ లభిస్తోంది. రూరల్​ డిస్కౌంట్​, కార్పొరేట్​ డిస్కౌంట్​లో ఏదో ఒక దానిని కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

* పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్​షోరూం ప్రైజ్​లు. ఇవి ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

* వాహనాలపై డిస్కౌంట్లు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. పూర్తి వివరాల కోసం సమీపంలోని డీలర్​షిప్​ షోరూంను సంప్రదించాల్సి ఉంటుంది.

నవంబర్​లో వాహనాల విక్రయాల డేటాను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి. 

WhatsApp channel