Car sales in November : పండుగే.. పండుగ- నవంబర్​లోనూ అదిరిపోయిన ఆటో సంస్థల సేల్స్​!-car sales in fast lane in november maruti hyundai tata motors post double digit growth ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Sales In November : పండుగే.. పండుగ- నవంబర్​లోనూ అదిరిపోయిన ఆటో సంస్థల సేల్స్​!

Car sales in November : పండుగే.. పండుగ- నవంబర్​లోనూ అదిరిపోయిన ఆటో సంస్థల సేల్స్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 02, 2022 10:55 AM IST

Car sales in November 2022 in India : నవంబర్​లోనూ ఆటో సంస్థలు పండుగ చేసుకున్నాయి. నవంబర్​ వాహనాల విక్రయాల డేటాపై ఓ లుక్కేయండి.

పండుగ సీజన్​ కొనసాగుతోంది.. నవంబర్​లో అదిరి వాహనాల సేల్స్​
పండుగ సీజన్​ కొనసాగుతోంది.. నవంబర్​లో అదిరి వాహనాల సేల్స్​

Car sales in November 2022 in India : దేశంలో అక్టోబర్​తో పండుగ సీజన్​ ముగిసింది. కానీ ఆటో ఇండస్ట్రీకి మాత్రం ఇప్పటికీ పండుగ సీజన్​ కొనసాగుతోంది. నవంబర్​ కార్ల విక్రయాల డేటాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గత కొన్నేళ్లతో పోల్చుకుంటే.. విక్రయాల పరంగా ఆటో పరిశ్రమకు ఇదే ది బెస్ట్​ నవంబర్​గా నిలవడం విశేషం.

నవంబర్​లో డీలర్స్​కు డిస్ప్యాచ్​ చేసిన వాహనాల్లో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్​, టాటా మోటార్స్​, మహింద్రా సంస్థ రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇక కియా ఇండియా, హోండా కార్స్​, స్కోడా, ఎంజీ మోటార్​ల సేల్స్​ కూడా బలంగా కనిపించాయి. టాయోటా కిర్లోస్కర్​ మోటార్​, నిస్సాన్​లు మాత్రమే.. పరిశ్రమ జోరును అందుకోలేకపోయాయి. 2021 నవంబర్​తో పోల్చుకుంటే.. వీటి డొమెస్టిక్​ హోల్​సేల్స్​ పడిపోయాయి.

మారుతీ.. అదిరగొట్టింది..

Maruti Suzuki November car sales : దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. నవంబర్​ నెల 1,39,306 వాహనాలను విక్రయించింది. 2021 నవంబర్​లో అది 1,17,791గా ఉంది. అంటే 18శాతం పెరిగినట్టు. బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్​ విటారాతో కూడిన యుటిలిటీ సెగ్మెంట్​లో 32,563 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇది 24,574గా ఉంది.

వాహనాల హోల్​సేల్స్​ పరంగా.. విక్రయాలు 3లక్షల యునిట్లు దాటడం ఇది వరుసగా 6వ నెల కావడం విశేషం. మొత్తం మీద.. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్​ వరకు.. 35లక్షలకుపైగా వాహనాలను విక్రయించినట్టు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ శశాంక్​ శ్రీవాస్తవ తెలిపారు.

"2018లో 33.8లక్షల వాహనాలను విక్రయించాము. 2021 జనవరి నుంచి నవంబర్​ వరకు 28లక్షల యూనిట్లను అమ్మాము. ఇప్పుటికే వాహనాల విక్రయాల సంఖ్య 35లక్షలు దాటింది. గతేడాదితో పోల్చుకుంటే 25శాతం పెరిగినట్టు. ఇక డిసెంబర్​ ముగిసేసరికి.. ఏడాది మొత్తంలో మారుతీ సుజుకీ వాహనాల విక్రయాల సంఖ్య 38లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నాము," అని శశాంక్​ వెల్లడించారు.

టాటా మోటార్స్​కు పండుగే..!

Tata Motors car sales in November : 2021 నవంబర్​లో 62,192 యూనిట్లను విక్రయించిన టాటా మోటార్స్​.. ఈసారి 75,478 వాహనాలను అమ్మింది. ఫలితంగా ఏడాది కాలంలో 21శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక దేశీయ దిగ్గజ సంస్థ డొమెస్టిక్​ సేల్స్​ 27శాతం పెరిగి.. 73,467కు చేరింది.

ఈసారి ప్యాసింజర్​ వాహనాల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్​(29,947)తో పోల్చుకుంటే.. 55శాతం వృద్ధితో.. 46,425 యూనిట్లను విక్రయించింది టాటా మోటార్స్​.

ఇండియాలో ఈవీ సెగ్మెంట్​లో ఎక్కువ మార్కెట్​ షేరు కలిగి ఉన్న టాటా మోటార్స్​.. తన జోరును కొనసాగిస్తోంది. ఈ నవంబర్​లో 4,451 ఈవీలను విక్రయించింది. 2021 నవంబర్​లో అది 1,811గా ఉండేది. అంటే.. 146శాతం వృద్ధిని సాధించినట్టు.

హ్యుందాయ్​ మోటార్​.. హుందాగా!

Hyundai Motor car sales : హ్యూందాయ్​ మోటార్.. వాహనాల విక్రయం 30శాతం పెరిగింది. గతేడాది నవంబర్​లో 37,001 యూనిట్లు విక్రయిస్తే.. ఈసారి ఆ సంఖ్య 48,003కి చేరింది. ఇక సంస్థ.. అత్యదిక డొమెస్టిక్​ సేల్స్​ చేసిన సంవ​త్సరంగా 2022 మిగిలిపోతుందని హ్యుందాయ్​ మోటార్​ ఇండియా డైరక్టర్​ తరుణ్​ గర్గ్​ అభిప్రాయపడ్డారు.

హ్యుందాయ్​ మోటార్​ ఎగుమతులు కూడా భారీగానే పెరిగాయి. 61.5శాతం వృద్ధితో.. నవంబర్​లో 16,001 యూనిట్లను ఎక్స్​పోర్ట్​ చేసింది ఆ సంస్థ. గతేడాది నవంబర్​లో అది 9,009గా ఉండేది. మొత్తం మీద 2022 నవంబర్​లో 64,004 యూనిట్లను విక్రయించింది ఆ ఆటో సంస్థ. గతేడాది ఇదే సమయంలో 46,910 యూనిట్లు మాత్రమే అమ్మింది.

జోరు మీదున్న మహీంద్రా అండ్​ మహీంద్రా..

M&M car sales November data : మహీంద్రా అండ్​ మహీంద్రా వాహనాల విక్రయాలు 45శాతం పెరిగాయి. మొత్తం మీద నవంబర్​లో 58,303 యూనిట్లను విక్రయించింది. సంస్థ వాల్యూమ్​లు 30,238గా ఉంది. ఇక 2021 నవంబర్​తో 74 ప్యాసింజర్​ వెహికిల్స్​ను సంస్థ అమ్మితే.. ఈసారి అది 154కు చేరింది. అంటే రెండింతల వృద్ధి నమోదైనట్టు.

కియా ఇండియా.. కళకళ..!

ఈ ఏడాది నవంబర్​​లో 24,025 యూనిట్లను అమ్మింది కియా ఇండియా. ఇది 69శాతం వృద్ధితో సమానం. కియా సోనెట్​, కియా సెల్టోస్​, కియా కార్నివాల్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది.

స్కోడా.. ఎంజీ మోటార్​..

స్కోడా ఆటో ఇండియా.. గత నెలలో రెండింతల వృద్ధిని సాధించింది. మొత్తం మీద 4,433 యూనిట్లను విక్రయించింది.

ఎంజీ మోటర్​ రీటైల్​ సేల్స్​లో 64శాతం వృద్ధి నమోదైంది. ఈ నవంబర్​లో 4,079 యూనిట్లను విక్రయించింది ఈ సంస్థ.

నిస్సాన్​- టయోటాకు టాటా..!

Toyota car sales dip : నవంబర్​లో టయోటా సంస్థ విక్రయాలు 10శాతం తగ్గాయి. మొత్తం మీద గత నెలలో 11,765 యూనిట్లను విక్రయించింది టయోటా. అర్బన్​ క్రూయిజర్​ను టయోటా డిస్కంటిన్యూ చేసింది. ఇన్నోవా డీజిల్​ వర్షెన్​ బుకింగ్స్​ను నిలిపివేసింది. ఈ పరిణామాలతో విక్రయాలు తగ్గినట్టు కనిపిస్తోంది.

ఇక నిస్సాన్​ పరిస్థితి కూడా ఇంతే. 2021 నవంబర్​లో 2,651 యూనిట్లను విక్రయించిన నిస్సాన్​ సంస్థ.. ఈసారి 2,400 వాహనాలను మాత్రమే అమ్మింది.

Whats_app_banner

సంబంధిత కథనం