Offers on Honda cars in December : ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​.. హోండా వాహనాలపై భారీ డిస్కౌంట్లు!-offers on honda cars in december save up to 72000 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Offers On Honda Cars In December, Save Up To 72000 Check Full Details Here

Offers on Honda cars in December : ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​.. హోండా వాహనాలపై భారీ డిస్కౌంట్లు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 02, 2022 08:21 AM IST

Offers on Honda cars in December : హోండా కారు కొనాలని భావిస్తున్నారా? అయితే.. ఇదే మంచి సమయం. పలు వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ఆ సంస్థ. మీరూ ఓ లుక్కేయండి.

ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​.. హోండా వాహనాలపై భారీ డిస్కౌంట్లు!
ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​.. హోండా వాహనాలపై భారీ డిస్కౌంట్లు!

Offers on Honda cars in December : ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​లో భాగంగా.. అనేక ఆటో సంస్థలు.. తమ వాహనాలపై డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఈ జాబితాలో హోండా కూడా చేరింది. హోండా సిటీ, మేజ్​, జాజ్​తో పాటు ఇతర వాహనాలపై ఆఫర్లు ఇస్తోంది. ఫిఫ్త్​ జనరేషన్​ హోండా సిటీపై ఏకంగా రూ. 72,145 వరకు తగ్గింపు లభిస్తోంది. హోండా వాహనాలపై ఉన్న డిస్కౌంట్లను ఓసారి చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

హోండా సిటీ ఫిప్త్​ జనరేషన్​..

Honda City 5th Generation : ఈ వాహనంపై రూ. 30,000 వరకు క్యాష్​ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఫ్రీ యాక్ససరీస్​ని కూడా కలుపుకుంటే అది రూ. 32,145గా ఉంటుంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 20,000 తగ్గింపు లభిస్తోంది. లాయల్టీ బోనస్​ కారణంగా రూ. 5వేల తగ్గుతుంది. లాయల్టీ ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 7000 దిగొస్తుంది. ఇక కార్పొరేట్​ డిస్కౌంట్​ పేరుతో ఇంకో రూ. 8వేలను తగ్గించింది హోండా సంస్థ. మొత్తం మీద రూ. 72,145 వరకు ధర తగ్గుతోంది.

హోండా సిటీ ఫోర్త్​ జనరేషన్​..

Honda City 5th Generation discounts : ఈ వాహనంపై క్యాష్​ డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్​ బోనస్​లు, లాయల్టీ ఎక్స్​ఛేంజ్​ బోనస్​లు, కార్పొరేట్​ డిస్కౌంట్లు లేవు. లాయల్టీ బోనస్​ కింద కేవలం రూ. 5వేలను తగ్గిస్తోంది హోండా. మొత్తం మీద ఈ వాహనంపై రూ. 5వేల తగ్గనుంది.

హోండా డబ్ల్యూఆర్​-వీ..

offers on Honda WR-V : ఈ వాహనంపై క్యాష్​ డిస్కౌంట్​, ఫ్రీ యాక్ససరీస్​ కింద రూ. 35,340 వరకు తగ్గింది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 20వేలు తగ్గాయి. ఇక లాయల్టీ బోనస్​ కింద రూ. 5వేలు, లాయల్టీ ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 7వేలు తగ్గించింది హోండా సంస్థ. కార్పొరేట్​ డిస్కౌంట్​ పేరుతో మరో రూ. 5వేలు తగ్గిస్తోంది. ఫలితంగా ఈ వాహనం ధరపై రూ. 72,340 వరకు తగ్గుతోంది.

హోండా జాజ్​..

Honda Jazz discounts in december : హోండా జాజ్​పై రూ. 10వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. ఫ్రీ యాక్సరీస్​ను కలుపుకుంటే అది రూ. 12,047 వరకు వెళుతుంది. ఇక ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10వేలు, లాయల్టీ బోనస్​ కింద రూ. 5వేలు, లాయల్టీ ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 7వేల వరకు తగ్గుతుంది. కార్పరేట్​ బోనస్​(రూ. 5వేలు)ను కూడా కలుపుకుంటే.. ఈ వాహనంపై రూ. 37,047 తగ్గింపు లభిస్తోంది.

హోండా అమేజ్​..

Honda Amaze price in Hyderabad : హోండా అమెజ్​పై క్యాష్​ డిస్కౌంట్​ కింద రూ. 10వేల ఆఫర్​ లభిస్తోంది. ఫ్రీ యాక్ససరీస్​ని కూడా కలుపుకుంటే అది రూ. 12,144గా ఉంది. ఇక ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 20వేలు, లాయల్టీ బోనస్​ కింద రూ. 5వేలు, కార్పొరేట్​ బోనస్​ కింద రూ. 6వేలు డిస్కౌంట్​ లభిస్తోంది. ఇందులో లాయల్టీ ఎక్స్​ఛేంజ్​ బోనస్​ లేదు. ఫలితంగా ఈ వాహనంపై రూ. 43,144 డిస్కౌంట్​ లభిస్తోంది.

* పైన చెప్పిన డిస్కౌంట్లన్నీ పెట్రోల్​ వేరియంట్లకే వర్తిస్తాయి. ఫిఫ్త్​ జనరేషన్​ హోండా సిటీ, అమేజ్​, డబ్ల్యూఆర్​-వీ డీజిల్​ వేరియంట్లపై ఆఫర్లు లేవు.

* హోండా జాజ్​, వీఆర్​-వీ, ఫోర్త్​ జనరేషన్​ వాహనాలను భవిష్యత్తులో హోండా సంస్థ నిలిపివేసే అవకాశం ఉంది.

* పైన చెప్పిన ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. మరిన్ని వివరాల కోసం సమీప డీలర్​షిప్​ షోరూంను సంప్రదించాల్సి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం