Discounts on Citroen C3 : సిట్రోయెన్​ సీ3పై భారీ డిస్కౌంట్లు..-limited time discounts on the citroen c3 save up to 30 000 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Limited Time Discounts On The Citroen C3, Save Up To 30,000, Check Full Details Here

Discounts on Citroen C3 : సిట్రోయెన్​ సీ3పై భారీ డిస్కౌంట్లు..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 22, 2022 07:33 AM IST

Discounts on Citroen C3 : సిట్రోయెన్​ సీ3పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు..

సిట్రోయెన్​ సీ3పై భారీ డిస్కౌంట్లు..
సిట్రోయెన్​ సీ3పై భారీ డిస్కౌంట్లు..

Discounts on Citroen C3 : పండుగ సీజన్​ ముగిసినప్పటికీ.. నవంబర్​ నెలలోనూ వివిధ వాహనాలపై డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తున్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి సిట్రోయెన్​ చేరింది. సిట్రోయెన్​ సీ3పై డిస్కౌంట్లను ప్రకటించింది ఈ ఆటో సంస్థ. సీ5 ఎయిర్​క్రాస్​.. ఇటీవలే లాంచ్​ అవ్వడంతో.. ఆ మోడల్​పై ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వడం లేదు. సిట్రోయెన్​ సీ3పై ఉన్న డిస్కౌంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

రూ. 30వేల వరకు..

సిట్రోయెన్​ సీ3పై ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10వేల వరకు లభిస్తోంది. కార్పొరేట్​ బోనస్​ కింద మరో రూ. 10వేలను ఆదా చేసుకోవచ్చు. వీటితో పాటు.. వాహనం కొనుగోలు చేసిన వారికి రెండేళ్ల మెయింటేనెన్స్​ ప్యాకేజీని ఉచితంగా ఇస్తోంది సిట్రోయెన్​. దీని విలువ రూ. 10వేల వరకు ఉండొచ్చు. ఈ వాహనంపై సంస్థ.. ఎలాంటి క్యాష్​ డిస్కౌంట్​ను ఇవ్వడం లేదు. అంటే.. సిట్రోయెన్​ సీ3పై రూ. 30వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నట్టు అర్థం.

ఈ నెలలో వివిధ కార్లపై ఉన్న ఆఫర్లు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Citroen C3 discounts : ప్రస్తుతం సిట్రోయెన్​ సీ3కి సంబంధించి రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. లైవ్​, ఫీల్​. సిట్రోయెన్​ సీ3 హ్యాచ్​బ్యాక్​ మోడల్​లో ఉంటుంది. 1.2లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​.. 82పీఎస్​ పవర్​, 115ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.2లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 110పీఎస్​ పవర్​, 190ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.2లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​లో 5స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​.. 1.2లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​లో 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​లు ఉంటాయి.

సిట్రోయెన్​ సీ3 లైవ్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.88లక్షలుగా ఉంది. సిట్రోయెన్​ సీ3 ఫల్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.15లక్షలుగా ఉంది. మారుతీ వాగన్​ ఆర్​, టాటా టియాగోకు ఈ వాహనం పోటీనిస్తోంది.

మహీంద్రా అండ్​ మహీంద్రాకు చెందిన కొన్ని వాహనాలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Citroen C3 latest discounts and offers : ఇక సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​ వర్షెన్​ను తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. సీ3 ఈవీగా దీనిని పిలుస్తున్నారు. ఇందులో 50కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చు. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఇది 350కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది.

(సిట్రోయెన్​ సీ3పై డిస్కౌంట్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం స్థానిక డీలర్​షిప్​ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ డిస్కౌంట్లు.. ప్రాంతాల బట్టి మారే అవకాశం ఉంది.)

టాటా మోటార్స్​ వాహనాలపై లభిస్తున్న డిస్కౌంట్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్