Huge Discounts on These Cars: ఈ ఐదు కార్లపై బంపర్ ఆఫర్లు.. ఈనెలలోనే!-huge discounts and benefits on these cars in this november month ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Huge Discounts And Benefits On These Cars In This November Month

Huge Discounts on These Cars: ఈ ఐదు కార్లపై బంపర్ ఆఫర్లు.. ఈనెలలోనే!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 20, 2022 09:11 PM IST

Huge Discounts on These Cars: ఈనెలలో కొన్ని కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫేమస్ మోడల్స్ మంచి బెనిఫిట్స్ తో లభిస్తున్నాయి. వాటిలో టాప్-5 ఆఫర్లు ఇవి.

Huge Discounts on These Cars: ఈ ఐదు కార్లపై బంపర్ ఆఫర్లు.. ఈనెలలోనే!
Huge Discounts on These Cars: ఈ ఐదు కార్లపై బంపర్ ఆఫర్లు.. ఈనెలలోనే! (HT_Photo)

Huge Discounts on These Cars: కొన్ని కార్లపై ప్రస్తుతం మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెలలో కారు కొనాలనుకునే వారికి ఇవి బాగా సూటవుతాయి. ధరపై డిస్కౌంట్‍తో పాటు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, ఉచిత యాక్ససరీలతో పాటు వివిధ రూపాల్లో ఆఫర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.10లక్షల నుంచి రూ.15లక్షల మధ్య రేంజ్‍లో ఉండే కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. నవంబర్ మొత్తంగా ఇవి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం భారీ ఆఫర్లతో ఉన్న టాప్-5 కార్లు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

నిస్సాన్ కిక్స్

Nissan Kicks Offers: నిస్సాన్ కిక్స్ కారుపై రూ.61,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.19,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.2,000 ఆన్‍లైన్ బుకింగ్ బోనస్‍ను దక్కించుకోవచ్చు. నిసాన్ కిక్స్ మోడల్స్ రూ.9.50లక్షల నుంచి రూ.14.90 లక్షల ధర మధ్య అందుబాటులో ఉన్నాయి.

హోండా సిటీ

Honda City offer: హోండా సిటీపై గరిష్ఠంగా రూ.59,292 ప్రయోజనాలు పొందే అవకాశం ప్రస్తుతం ఉంది. ఈ కారు కొనుగోలుపై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.32,292 వరకు విలువైన ఉచిత యాక్ససరీలు, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.7,000 వరకు, రూ.5,000 లాయల్టీ బోనస్, కార్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 బెనిఫిట్స్ దక్కించుకోవచ్చు. హోండా సిటీ మోడల్స్ రూ.11.57 లక్షల నుంచి రూ.15.52 లక్షల మధ్య ధరతో లభిస్తున్నాయి.

మహీంద్రా ఎక్స్ యూవీ 300

Mahindra XUV300 offers: మహీంద్రా ఎక్స్ యూవీ 300 కారుపై గరిష్ఠంగా రూ.79,500 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్‍పై రూ.29,350 వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. వివిధ వేరియంట్లపై క్యాష్ డిస్కౌంట్లు విభిన్నంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ బోనస్ రూ.25,000 వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,500 వరకు, ఇతర డిస్కౌంట్లు రూ.18,000 వరకు ఉంటాయి. ఆయా మోడల్‍ను బట్టి ఆఫర్లు వర్తిస్తాయి. ఎక్స్ యూవీ 300 మోడల్స్ రూ.8.41 లక్షల నుంచి రూ.14.07 లక్షల మధ్య అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా బొలెరో

Mahindra Bolero offers: మహీంద్రా బొలెరో కార్‍‍పై ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నాయి. రూ.42,100 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.13,100 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000 వరకు, రూ.15,000 వరకు ఇతర బెనిఫిట్స్ దక్కించుకోవచ్చు. రూ.9.53 లక్షల నుంచి రూ.10.48 లక్షల మధ్య మహీంద్రా బొలెరో మోడల్స్ లభిస్తున్నాయి.

మహీంద్రా మరాజో

Mahindra Marazzo offers: మహీంద్రా మరాజోపై రూ.41,000 వరకు బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఉంది. ఈ కారుపై రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.6,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ దక్కించుకోవచ్చు. మహీంద్రా మజారో రూ.13.41 లక్షలు, రూ.15.70 లక్షల ధర మధ్య లభిస్తోంది.

ఈ కార్లపై మోడళ్లను బట్టి బెనిఫిట్స్ విభిన్నంగా ఉంటాయి. టాప్ ఎండ్ మోడళ్లపై గరిష్ఠ బెనిఫిట్స్ లభిస్తాయి. మీరు ఎంపిక చేసుకునే మోడల్, కొనుగోలు చేసే ప్రాంతాన్ని బట్టి కూడా బెనిఫిట్స్ లో మార్పులు ఉండొచ్చు.

WhatsApp channel