Offers on Tata cars in november : ఈ టాటా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఈ నెలలో మాత్రమే!
Offers on Tata cars in november : టాటా మోటార్స్.. నవంబర్ నెలలో పలు కార్లపై ఆఫర్లు ఇస్తోంది. వాటిపై ఓ లుక్కేయండి..
Offers on Tata cars in november 2022 : ఓవైపు వాహనాల ధరలను పెంచినప్పటికీ.. పలు కార్ల వేరియంట్లపై నవంబర్ నెలలో ఆఫర్లు ఇస్తోంది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్. మీరు టాటా కారు కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. వీటిపై ఓ లుక్కేయండి.
ట్రెండింగ్ వార్తలు
టియాగో..
Tata Tiago Price : టాటా టియాగోపై రూ. 20వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 10వేల వరకు ధర తగ్గొచ్చు. టియాగో అన్ని వేరియంట్లపై ఈ బెనిఫిట్స్‌ని పొందవచ్చు. టియాగో ధరలు రూ. 5.40లక్షలు- రూ. 7.82లక్షలుగా ఉన్నాయి.
టిగోర్..
Tata Tigor offers : ఈ సబ్‌కాంపాక్ట్ సెడాన్ మోడల్‌పై రూ. 20,000 వరకు క్యాష్ బోనస్ లభిస్తోంది. సీఎన్జీ వేరియంట్‌కు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వస్తోంది. మిగిలిన వేరియంట్లకు అది రూ. 15వేలుగా ఉంది. అన్ని వేరియంట్లపై రూ. 3వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది. టాటా టిగోర్ ధర ప్రస్తుతం రూ. 6లక్షలు- రూ. 8.84లక్షల మధ్యలో ఉంది.
హారియర్..
Discounts on Tata Harrier car : హారియర్‌లోని కాజిరంగ, జెట్ ఎడిషన్లపై మాత్రమే క్యాష్ డిస్కౌంట్(రూ.3000) లభిస్తోంది. ఇతర వేరియంట్లపై క్యాష్ డిస్కౌంట్ రూ. 20వేలుగా ఉంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 30వేల తగ్గింపు ఇస్తున్నారు. ఇక కార్పొరేట్ బోనస్‌తో రూ. 5వేలు తగ్గుతుంది. మార్కెట్లో టాటా హారియర్ ధర ప్రస్తుతం రూ. 14.70లక్షలు- రూ. 22.20లక్షలుగా ఉంది.
సఫారీ..
Tata Safari price : హారియర్లాగే.. టాటా సఫారీ జెట్, కాజిరంగ ఎడిషన్లకు రూ. 30వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. మిగిలిన వేరియంట్లకు క్యాష్ డిస్కౌంట్లు రూ. 20వేలుగా ఉంది. అన్ని వేరియంట్లపై రూ. 30వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కార్పొరేట్ డిస్కౌంట్లు లేవు. మార్కెట్లో టాటా సఫారీ ధర రూ. 15.35లక్షలు- రూ. 23.56లక్షల మధ్యలో ఉంది.
* టాటా నెక్సాన్‌కు ఎలాంటి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లేవు. కానీ రూ. 5వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది.
* ఆల్ట్రోజ్, పంచ్, టాటా ఈవీ వాహనాలపై ఎలాంటి ఆఫర్లు లేవు.
* పైన చెప్పిన వాహనాల ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ప్రైజ్‌లు.
* లోకేషన్, కారు వేరియంట్ బట్టి ఈ డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం సమీపంలోని టాటా డీలర్షిప్ షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
Tata Motors to hike Car Prices : పెరగనున్న టాటా కార్ల ధరలు
November 05 2022
Tata Motors sales: టాటా మోటార్స్ సేల్స్ 15.5 శాతం జంప్
November 01 2022
Tata Tiago EV: టాటా టియాగో ఈవీ కారు వచ్చేసింది.. ధరెంతంటే!
October 01 2022