Telugu News  /  Business  /  Tata Motors To Hike Passenger Vehicles Prices From November 7
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Tata Motors to hike Car Prices : పెరగనున్న టాటా కార్ల ధరలు

05 November 2022, 17:07 ISTHT Telugu Desk
05 November 2022, 17:07 IST

Tata motors to Increase Passenger Vehicles Prices : ప్యాసింజర్ వాహనాల ధరలను టాటా మోటార్స్ పెంచనుంది. ఏ రోజు నుంచి కొత్త ధరలు వర్తిస్తాయో ఆ సంస్థ ప్రకటించింది.

Tata Motors to hike Passenger Vehicles Prices : దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ కు చెందిన వాహనాల ధరలు పెరగనున్నాయి. ప్యాసింజర్ వెహికల్స్ ధరలను కాస్త అధికం చేయనున్నట్టు టాటా మోటార్స్ శనివారం ప్రకటించింది. కొత్త ధరలు నవంబర్ 7వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. సగటున 0.9శాతం ధర అధికమవుతుందని పేర్కొంది. అయితే వేరియంట్, మోడల్‍ను బట్టి ఈ ధర పెంపు వర్తించనుంది.

ట్రెండింగ్ వార్తలు

Tata Motors to hike Passenger Vehicles Prices : ఇన్‍పుట్ ఖర్చులు పెరగడంతో..

వాహనాల ఉత్పత్తితో పాటు ఓవరాల్‍గా ఇన్‍పుట్ ఖర్చులు అధికమవటంతో కాస్త ధరలు పెంచుతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. వాహనాల ధరల పెరుగుదల వల్ల ఆ సంస్థకు లాభదాయకంగా ఉండనుంది. టియాగో, పంచ్, హారియర్, సఫారీ లాంటి అనేక ప్యాసింజర్ వాహనాలను టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది.

Tata Motors to hike Passenger Vehicles Prices : అక్టోబర్ లో అదిరిపోయే సేల్స్

దేశీయ మార్కెట్‍లో అక్టోబర్ నెలకు గాను ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో Tata Motors అదరగొట్టింది. మంచి వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహనాలతో కలుపుకొని మొత్తంగా అక్టోబర్ లో 45,423 ప్యాసింజర్ వెహికల్స్ ను టాటా మోటార్స్ విక్రయించింది. గత సంవత్సరం ఇదేనెలతో పోలిస్తే ఇది 33శాతం అధికం. గతేడాది అక్టోబల్ లో 34,155 వెహికల్స్ సేల్ కాగా.. ఈ సంవత్సరం అదే నెలలో అంతకంటే సుమారు 11వేలు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

Tata Motors to hike Passenger Vehicles Prices : టాటా టియాగో ఈవీ

టాటా మోటార్స్ ఇటీవల టియాగో (Tata Tiago EV) ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్‍లో టియాగో ప్రారంభ ధర రూ.8.49లక్షలు (ఎక్స్- షోరూమ్)గా ఉంది. రూ.11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు టియాగో ధరలు ఉన్నాయి. టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీలను కలిగి ఉంటుంది. 19.2kWh చిన్న బ్యాటరీ, 24kWh సామర్థ్యం ఉండే పెద్ద బ్యాటరీ ఉంటాయి. ఇందులో చిన్న బ్యాటరీ 250 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తుంది. మరో బ్యాటరీ 315 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‍ను కల్పిస్తుంది.

టాపిక్