Mahindra Cars: మహీంద్రా కార్ కొనాలనుకుంటున్నారా? ఈ మోడళ్లపై రూ.62వేల వరకు ఆఫర్లు-huge offers on mahindra cars you can get up to rs 62000 on these models ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Huge Offers On Mahindra Cars You Can Get Up To Rs 62000 On These Models

Mahindra Cars: మహీంద్రా కార్ కొనాలనుకుంటున్నారా? ఈ మోడళ్లపై రూ.62వేల వరకు ఆఫర్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 13, 2022 05:13 PM IST

Mahindra Car offers : మహీంద్రా కార్ కొనాలనుకుంటున్న వారికి గుడ్‍న్యూస్ ఇది. కొన్ని మోడళ్లపై రూ.62వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. ఈనెలలోనే ఇవి అందుబాటులో ఉంటాయి.

మహీంద్రా కార్ కొనాలనుకుంటున్నారా? ఈ మోడళ్లపై రూ.62వేల వరకు ఆఫర్లు
మహీంద్రా కార్ కొనాలనుకుంటున్నారా? ఈ మోడళ్లపై రూ.62వేల వరకు ఆఫర్లు

Mahindra Car offers : మీరు మహీంద్రా కారును ఈ నెలలోనే కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు చాలా నచ్చే విషయం ఇది. ఎంపిక చేసిన కొన్ని మహీంద్రా మోడళ్లపై రూ.62,000 వరకు ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా ఎక్స్ యూవీ300 (Mahindra XUV300), మహీంద్రా మరాజో (Mahindra Marazzo), మహీంద్రా బొలెరో (Mahindra Bolero) సహా మరిన్ని కార్లపై ఈ ఛాన్స్ లభిస్తోంది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్, థార్, ఎక్స్ యూవీ700 మోడళ్లపై ఆఫర్లు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఆఫర్లతో లభిస్తున్న మహీంద్రా మోడల్స్ ఏవో చూడండి.

ట్రెండింగ్ వార్తలు

మహీంద్రా ఎక్స్ యూవీ 300 (Mahindra XUV300)

మహీంద్రా ఎక్స్ యూవీ 300 కార్ కొనుగోలు చేస్తే రూ.23,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్‍తో పాటు రూ.25,000 ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో పాటు రూ.10,000 విలువైన యాక్ససరీలను ప్రస్తుతం కొనుగోలుదారులు పొందవచ్చు.

ఎంపిక చేసిన Mahindra XUV300 పెట్రోల్ వేరియంట్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి. రూ.29,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ రూ.25,000 వరకు అదనంగా ఉంటుంది. రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.10,000 విలువైన యాక్ససరీలు ఉచితంగా పొందవచ్చు.

మహీంద్రా మరాజో (Mahindra Marazzo)

ప్రస్తుతం నవంబర్ నెలలో మహీంద్రా మజారో కార్ రూ.35,200 తగ్గింపుతో లభిస్తోంది. ఇందులో రూ.20వేల క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అలాగే రూ.10,000 వరకు ఎక్చేంజ్ బోనస్ దక్కుతుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,200గా ఉంటుంది.

మహీంద్రా బొలెరో (Mahindra Bolero)

మహీంద్రా బొలెరో కారును రూ.28,000 వరకు డిస్కౌంట్‍తో ఈనెలలో దక్కించుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.6,500, ఎక్చేంజ్ డిస్కౌంట్ కింద రూ.10,000 వరకు, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటాయి. అలాగే యాక్ససరీలపై రూ.8,500 విలువైన ఆఫర్స్ పొందవచ్చు.

ఇండియాలో బొలేరో నియో ప్లస్‍ (Mahindra Bolero Neo Plus) ను లాంచ్ చేసేందుకు మహీంద్ర సిద్ధమవుతోందని సమాచారం. 7, 9 సీట్ లేఅవుట్స్ ఆప్షన్‍లలో ఈ కొత్త ఎస్‍యూవీ వస్తుందని తెలుస్తోంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ లతో ఈ కొత్త మోడల్ వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel