Tata Motors into Sensex 30 : సెన్సెక్స్‌లోకి టాటా మోటార్స్.. డా.రెడ్డీస్ ఔట్!
Tata Motors into Sensex 30 : టాటా మోటార్స్ స్టాక్.. సెన్సెక్స్30లోకి ఎంట్రీ ఇవ్వనుంది. డా. రెడ్డీస్ స్టాక్‌ను టాటా మోటార్స్ రిప్లేస్ చేయనుంది.
Tata Motors into Sensex 30 : ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ 30 జాబితాలోకి దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్ స్టాక్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఏషియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ శుక్రవారం వెల్లడించింది. సెన్సెక్స్ 30లోకి టాటా మోటార్స్ చేరనుండగా.. అదే సమయంలో డా. రెడ్డీస్.. ఈ జాబితాలో నుంచి బయటకు వెళ్లిపోనుంది.
తాజా మార్పులు 2022 డిసెంబర్ 19న అమల్లోకి వస్తాయి.
సెన్సెక్స్ నెక్స్ట్ 50..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో తరచూ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది సాధారణమైన ప్రక్రియే. కాగా.. సూచీల్లోకి ఏదైనా సంస్థ వెళుతుంటే.. అది ఆ స్టాక్‌కి మంచిదని అభిప్రాయాలు ఉంటాయి. అదే సమయంలో ఏదైనా సంస్థ వెళ్లిపోతుంటే.. నెగిటివ్‌గా చూస్తారు.
Sensex rejig latest news : ఇక ఎస్ అండ్ పీ బీఎస్ఈ 100 ఇండెక్స్ నుంచి అదానీ టోటల్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ను.. అదానీ పవర్, ఇండియన్ హోటల్స్ స్టాక్స్ రిప్లేస్ చేయనున్నాయి. సెన్సెక్స్ నెక్స్ట్ 50 నుంచి అదానీ టోటల్ గ్యాస్, హెచ్‌పీసీఎల్ బయటకు వెళుతుండగా.. అదానీ పవర్, ఇండియన్ హోటల్స్ ఎంట్రీ ఇవ్వనున్నాయి.
ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్50, ఎస్ అండ్ పీ బీఎస్ఈ బ్యాంకెక్స్ సూచీల్లో ఎలాంటి మార్పులు లేవు.
Sensex 30 companies list : శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి టాటా మోటార్స్ షేరు రూ. 423.55 వద్ద స్థిరపడింది. అదే సమయంలో అదానీ పవర్ రూ. 336.50 వద్ద స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఇండియన్ హోటల్స్ షేరు విలువ రూ. 313.90కు చేరింది.
Tata Motors share price : 2023 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో టాటా మోటార్స్ నెట్ లాస్ రూ. 944.61కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్ లాస్ రూ. 4,441.57కోట్లుగా ఉండేది. గత త్రైమాసికంలో నెట్ లాస్ రూ. 5,0006.60కోట్లుగా నమోదైంది.
టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ.. క్యూ2లో రికార్డు స్థాయి లాభాలను (రూ. 122కోట్లు) నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 121కోట్ల నష్టాన్ని నమోదు చేసింది ఈ సంస్థ. ఇక కంపెనీ ఆదాయం 67శాతం పెరిగి రూ. 1,258కోట్లకు చేరింది.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. బీఎస్ఈ సెన్సెక్స్.. 87పాయింట్ల నష్టంతో 61,663 వద్ద ముగిసింది. 36పాయింట్ల నష్టంతో 18308 వద్ద స్థిరపడింది నిఫ్టీ.
సంబంధిత కథనం