Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 40 పాయింట్లు అప్​-stock market news today 18 november 2022 sensex nifty opens on a positive note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News Today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 40 పాయింట్లు అప్​

Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 40 పాయింట్లు అప్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 18, 2022 09:17 AM IST

Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

దేశీయ స్టాక్​ మార్కెట్లు
దేశీయ స్టాక్​ మార్కెట్లు (MINT_PRINT)

Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 132పాయింట్ల లాభంతో 61,882 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50.. 46పాయింట్లు వృద్ధిచెంది 18390 వద్ద కొనసాగుతోంది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ముగించాయి దేశీయ సూచీలు. నిఫ్టీ 65 పాయింట్లు కోల్పోయి 18,344 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్​ 230 పాయింట్ల నష్టంతో 61,751 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ 77 పాయింట్లు పతనమై 42,458 లెవల్​ వద్దకు చేరుకుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో.. దేశీయ సూచీలకు నష్టాలు వచ్చాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61858-18383 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ల ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 18318- 18298 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18398- 18423 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy today : టాటా కన్జ్యూమర్​ ప్రాడక్ట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ .772, టార్గెట్​ రూ. 800-810
  • ఐసీఐసీఐ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 900, టార్గెట్​ రూ. 940- 950
  • మేదాంత:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ 385, టార్గెట్​ రూ. 480

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

ఏషియన్​ పెయింట్స్​, అల్ట్రాటెక్​, ఎల్​ అండ్​ టీ, కొటాక్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎం అండ్​ ఎం, టైటాన్​, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

అమెరికా మార్కెట్లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. రానున్న రోజుల్లో కూడా.. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను తగ్గించకపోవచ్చన్న భయం మదుపర్లలో నెలకొంది. ఫలితంగా మదుపర్లు అమ్మకాలు సాగించారు. డౌ జోన్స్​ 0.02శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.31శాతం, నాస్​డాక్​ 0.35శాతం నష్టాల్లో ముగిశాయి.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్​ నిక్కీ.. 0.3శాతం వృద్ధిచెందింది. సౌత్​ కొరియా కాస్పి 0.89శాతం పెరిగింది. హాంగ్​సెంగ్​.. 1.5శాతం పతనమైంది.

చమురు ధరలు..

Stock market news today : చమురు ధరలు 3శాతం పతనమయ్యాయి. బ్రెంట్​ క్రూడ్​ 3 డాలర్లు పతనమై.. బ్యారెల్​కు 89.78 డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో.. ఎఫ్​ఐఐలు రూ. 618.37కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు.. రూ. 449.22 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఎఫ్​ అండ్​ ఓ బ్యాన్​ లిస్ట్​..

బల్​రామ్​ చిని మిల్స్​, బీహెచ్​ఈఎల్​, డెల్టా కార్ప్​, గుజరాత్​ నార్మద వ్యాలీ ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​, ఇండియాబుల్స్​ హౌజింగ్​ ఫైనాన్స్​, సన్​ టీవీ నెట్​వర్క్​ స్టాక్​లు.. నేడు ఎఫ్​ అండ్​ ఓ బ్యాన్​లో ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం