Stocks to buy today : ట్రేడర్స్​ గైడ్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!-stocks to buy today 6 stocks that traders should track on 18 november ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ గైడ్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!

Stocks to buy today : ట్రేడర్స్​ గైడ్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 18, 2022 07:26 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​.. శుక్రవారం ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

ట్రేడర్స్​ గైడ్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!
ట్రేడర్స్​ గైడ్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!

Stocks to buy today : వరుసగా రెండు సెషన్స్​లో లాభపడిన దేశీయ స్టాక్​ మార్కెట్లు.. గురువారం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 65 పాయింట్లు కోల్పోయి 18,343 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్​ 230 పాయింట్ల నష్టంతో 61,750 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ 77 పాయింట్లు పతనమై 42,458 లెవల్​ వద్దకు చేరుకుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో.. దేశీయ సూచీలకు నష్టాలు వచ్చాయి.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ బుల్లిష్​గానే ఉంది. 18,250 వద్ద నిఫ్టీకి సపోర్ట్​ లభించే అవకాశం ఉంది. అక్కడి నుంచి నిఫ్టీ పెరిగితే.. మరింత బుల్లిష్​ మూమెంట్​ను ఆశించవచ్చు.

"కొన్ని రోజుల ముందు వరకు మార్కెట్లు పెరిగాయి. లార్జ్​ క్యాప్​ కంపెనీలు.. మార్కెట్​ ఎదుగుదలకు తోడ్పడ్డాయి. ఆ తర్వాత అంతర్జాతీయంగా సానుకూల పవనాలు లేకపోవడంతో.. దేశీయ సూచీలు ప్రస్తుతం కాన్సాలిడేషన్​ స్టేజ్​లో ఉన్నాయి. వస్తున్న కరెక్షన్​ను బుల్లిష్​గానే పరిగణించాల్సి ఉంటుంది," అని 5పైసా.కామ్​ లీడ్​ రీసెర్చ్​ రుచిత్​ జైన్​ అభిప్రాయపడ్డారు.

ట్రేడర్లు.. సానుకూల మైండ్​సెట్​తోనే ట్రేడింగ్​ చేయాలని, మార్కెట్లు ఇంకా పెరుగుతాయని రుచిత్​ అన్నారు. అయితే.. ఎంచుకునే స్టాక్​ కీలకం అని పేర్కొన్నారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 70పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.

అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : టాటా కన్జ్యూమర్​ ప్రాడక్ట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ .772, టార్గెట్​ రూ. 800-810

ఐసీఐసీఐ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 900, టార్గెట్​ రూ. 940- 950

మేదాంత:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ 385, టార్గెట్​ రూ. 480

బికాజి ఫుడ్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 305, టార్గెట్​ రూ. 365

టాటా స్టీల్​:- బై రూ. 106.75, స్టాప్​ లాస్​ రూ. 106.55, టార్గెట్​ రూ. 107.80

అదానీ పోర్ట్స్​:- బై రూ. 897, స్టాప్​ లాస్​ రూ. 892.85, టార్గెట్​ రూ. 906

Whats_app_banner

సంబంధిత కథనం