Stock Market: నష్టాలతో సూచీలు షురూ.. సెన్సెక్స్ 111 పాయింట్లు డౌన్
Stock Markets Today: స్టాక్ మార్కెట్లు నేడు నేలచూపులతోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావం భారత సూచీలపై పడింది.
Stock Markets Opening Today: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం (నవంబర్ 17) ప్రతికూలతతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ 111.07 పాయింట్లు పడిపోయి 61,867.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45.85 పాయింట్లు నష్టపోయి 18,368.05 పాయింట్లు వద్ద ఉంది. అమెరికాతో పాటు ఆసియాలోని చాలా మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం భారత మార్కెట్‍లపైనా పడింది.
ట్రెండింగ్ వార్తలు
Stock Market Today: టాప్ గెయినర్స్, లూజర్స్ స్టాక్స్ ఇవే..
సెన్సెక్స్ సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, సన్ ఫార్మా, ఏటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హింద్ కాపర్, టాటా మోటార్స్, అశోక్ లేల్యాండ్, ఐచర్ మోటార్స్, మైండ్ ట్రీ షేర్లు టాప్ లూజర్స్ గా ఆరంభమయ్యాయి.
Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 123.63 పాయింట్లు కోల్పోయి 61,857.09 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112.80 పాయింట్లు నష్టపోయి 18,296.90 పాయింట్ల వద్దకు చేరింది.
Stock Market: అమెరికా మార్కెట్లు డౌన్
అమెరికా స్టాక్ మార్కెట్లలో బుధవారం అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. యూఎస్ సూచీల్లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 39.09 పాయింట్లు క్షీణించి.. 33,553.83 వద్ద స్థిరపడింది. ఎస్ అండ్ పీ 500 కూడా 32.94 పాయింట్లు నష్టపోయి 3,958 పాయింట్ల వద్దకు చేరింది. నాస్‍డాక్ కంపోజైట్ అత్యధికంగా 174.74 పాయింట్లు పడిపోయి.. 11,183.66 వద్ద స్థిరపడింది.
ఆసియా మార్కెట్‍లు మిశ్రమంగా నడుస్తున్నాయి. జపాన్, చైనా, హాంకాంగ్, తైవన్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఎఫ్ఐఐలు, డీఐఐలు
భారత మార్కెట్‍లలో బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకం వైపు నిలువగా.. దేశీయ ఇన్‍స్టిట్యూనల్ ఇన్వెస్టర్లు ఎక్కువ కొనుగోళ్లు చేశారు. ఎన్ఎస్‍ఈ డేటా ప్రకారం, ఎఫ్ఐఐఎస్ బుధవారం రూ.368.06 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. డీఐఐఎస్ రూ.1,437.40 టోల్ విలువైన షేర్లను కొనుగోలు చేశారు.