Adani Enterprises in nifty 50 : నిఫ్టీ50లోకి మరో అదానీ గ్రూప్​ స్టాక్​-adani enterprises stock in nifty 50 index from today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Adani Enterprises Stock In Nifty 50 Index From Today

Adani Enterprises in nifty 50 : నిఫ్టీ50లోకి మరో అదానీ గ్రూప్​ స్టాక్​

Sharath Chitturi HT Telugu
Sep 30, 2022 10:31 AM IST

Adani Enterprises in nifty 50 : అదానీ గ్రూప్​నకు చెందిన అదానీ ఎంటర్​ప్రెజెస్​ స్టాక్​ నిఫ్టీ50లోకి చేరింది. శ్రీ సిమెంట్స్​ స్టాక్​ నిఫ్టీ50లో నుంచి బయటకు వచ్చింది.

నిఫ్టీ50లోకి చేరిన మరో అదానీ గ్రూప్​ స్టాక్​
నిఫ్టీ50లోకి చేరిన మరో అదానీ గ్రూప్​ స్టాక్​ (REUTERS)

Adani Enterprises in nifty 50 : నిఫ్టీ50లోకి మరో అదానీ గ్రూప్​ స్టాక్​ వచ్చి చేరింది. నిఫ్టీ రీబ్యాలెన్సింగ్​లో భాగంగా.. అదానీ ఎంటర్​ప్రైజెస్​ స్టాక్​.. ఆ జాబితాలోకి చేరింది. ఇక ఇప్పటివరకు నిఫ్టీ50లో ఉన్న శ్రీ సిమెంట్​ స్టాక్​.. నిఫ్టీ నెక్స్ట్​50లోకి వెళ్లింది. నిఫ్టీ50లో ఇది రెండో అదానీ గ్రూప్​ స్టాక్​. ఇప్పటికే అదానీ పోర్ట్స్​ అండ్​ స్పెషల్​ ఎకనామిక్​ జోన్​ స్టాక్​ నిఫ్టీ50లో ఉంది.

ఈ నెలలో జరిగిన సమీక్షలో భాగంగా.. నిఫ్టీ50 స్టాక్స్​లో మార్పులు చేయాలని నిర్ణయించింది ఐఎంఎస్​సీ(ఇండెక్స్​ మెయిన్​టేనెన్స్​ సబ్​ కమిటీ)- ఈక్విటీ. ఇందులో భాగంగానే అదానీ ఎంటర్​ప్రైజెస్​.. నిఫ్టీ50లోకి చేరింది.

Adani Enterprises share price : నిఫ్టీ50లోకి చేరితే మంచిదే!

నిఫ్టీ50లో ఏదైనా స్టాక్​ వచ్చి చేరితే.. అది సానుకూలంగా పరిగణిస్తుంటారు! నిఫ్టీ50 అనేది సూచి కాబట్ట.. దానిలోని స్టాక్స్​ ప్రదర్శన ఆధారంగా అది కదులుతుంది. అయితే.. లార్జ్​ క్యాప్​ స్టాక్స్​ ఉండే నిఫ్టీ50లో రిస్క్​ తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా.. మ్యూచువల్​ ఫండ్స్​ కూడా నిఫ్టీ50లో చేరే స్టాక్స్​పై  కాస్త ఎక్కువగా ఫోకస్​ చేస్తాయి. ఫలితంగా ఈ కారణంతో.. అదానీ ఎటర్​ప్రైజెస్​లో 213మిలియన్​ డాలర్లు వచ్చి చేరుతాయని ఎడిల్​వైస్​ సెక్యూరిటీస్​ అంచనా వేసింది.

Adani Enterprises stock news : అయితే.. శ్రీ సిమెంట్​కు ఇది ప్రతికూల విషయం. ఫలితంగా ఈ స్టాక్​.. 87మిలియన్​ డాలర్లు నష్టపోతుందని ఎడిల్​వైస్​ సెక్యూరిటీస్​ పేర్కొంది.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అదానీ ఎంటర్​ప్రైజెస్​ స్టాక్​ 32 పాయింట్ల నష్టంతో రూ. 3,437 వద్ద కొనసాగుతోంది. రూ. 3,448 వద్ద ఓపెన్​ అయిన అదానీ ఎంటర్​ప్రైజెస్​ స్టాక్​.. రూ. 3,371 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ స్టాక్​ 52 వీక్​ హై రూ. 3885 వద్ద ఉంది. ఇక 52 వీక్​ లో రూ. 1,367 వద్ద నమోదైంది.

Adani Enterprises multibaggar stock : మల్టీబ్యాగర్​ అదానీ స్టాక్​!

దేశీయ స్టాక్​ మార్కెట్​లో అదానీ ఎంటర్​ప్రెజెస్​ అనేది మల్టీబ్యాగర్​ స్టాక్​ అనడంలో సందేహం లేదు. ఈ ఏడాది మొదట్లో రూ. 1,715 వద్ద ఉన్న ఈ స్టాక్​.. ప్రస్తుతం రూ. 3,437 దగ్గర ట్రేడ్​ అవుతోంది. ఒక్క 2022లోనే 100శాతం కన్నా ఎక్కువ రిటర్నులను తెచ్చిపెట్టింది. ఇక ఏడాది కాలంలో 135శాతం, ఐదేళ్ల కాలంలో 2700శాతం పెరిగింది.

అదానీ ఎంటర్​ప్రైజెస్​ ప్రస్తుత మార్కెట్​ క్యాపిటల్​ రూ. 3.96లక్షల కోట్లుగా ఉంది.

దేశీయ స్టాక్​ మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్​ 220 పాయింట్ల లాభంతో 56,630 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 49పాయింట్ల లాభంతో 16,867 వద్ద ట్రేడ్​ అవుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం