Gautam Adani: ప్రపంచ ధనవంతుల్లో అదానీకి రెండోస్థానం-adani listed as second richest person in the world ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gautam Adani: ప్రపంచ ధనవంతుల్లో అదానీకి రెండోస్థానం

Gautam Adani: ప్రపంచ ధనవంతుల్లో అదానీకి రెండోస్థానం

HT Telugu Desk HT Telugu
Sep 16, 2022 03:51 PM IST

Gautam Adani: అదానీ గ్రూప్ అధినేత ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండోస్థానంలో నిలిచారు. 155.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఈ ఘనత సాధించారు.

60 ఏళ్ల గౌతమ్ అదానీ
60 ఏళ్ల గౌతమ్ అదానీ

Gautam Adani: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దాదాపు 12.37 లక్షల కోట్ల రూపాయల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్‌లో సెప్టెంబరు 16న ఆయన రెండో స్థానంలో నిలిచారు. 60 ఏళ్ల గౌతమ్ అదానీ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను అధిగమించారు. మొదటి స్థానంలో టెస్లా ఫౌండర్ ఇలాన్ మస్క్ నిలిచారు. ఆయన 270 బిలియన్ డాలర్లు.

గౌతమ్ అదానీ సంపద ఇదీ..

- భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ముంద్రాను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ భారతదేశంలోని అతి పెద్ద థర్మల్ బొగ్గు ఉత్పత్తిదారుగా ఉంది. అతిపెద్ద బొగ్గు వ్యాపారి కూడా.

- మే 2022లో స్విస్ దిగ్గజం హోల్సిమ్ యొక్క భారతీయ సిమెంట్ విభాగాన్ని $10.5 బిలియన్లకు కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుచుకోవడం ద్వారా అదానీ.. సిమెంట్ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రపంచంలోనే గొప్ప గ్రీన్ ఎనర్జీ జనరేటర్‌గా ఎదగాలనే తపనతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో $70 బిలియన్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించారు.

- మార్చి 2022 నుండి స్టాక్ ఎక్స్ఛేంజ్ రికార్డుల ప్రకారం.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌లో అదానీకి 75% యాజమాన్య వాటా ఉంది. దీనికి తోడు అదానీ టోటల్ గ్యాస్‌లో 37% వాటాను, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో 65% వాటాను, అదానీ గ్రీన్ ఎనర్జీలో 61% వాటాను కలిగి ఉన్నారు.

- అదానీ గత నెలలో మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ అధినేత బిల్ గేట్స్‌ను అధిగమించి మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా అధిగమించారు. దీనికి ముందు అతను అత్యంత సంపన్న ఆసియా వ్యక్తిగా ఉన్న ముఖేష్ అంబానీని ఫిబ్రవరిలో అధిగమించారు.

- అదానీ కాలేజీ డ్రాపౌట్. తన తండ్రి వస్త్ర వ్యాపారంపై ఆసక్తి చూపకుండా 1988లో కమోడిటీస్ ఎగుమతి కంపెనీని స్థాపించారు. 2008లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఉగ్రదాడిలో అదానీ ప్రాణాలతో బయటపడ్డారు.

IPL_Entry_Point