Electric cars with highest range : ది బెస్ట్​ ‘రేంజ్​’ ఉన్న ఎలక్ట్రిక్​ కార్స్​ ఇవే..!-check out the list of best electric cars with highest range in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Cars With Highest Range : ది బెస్ట్​ ‘రేంజ్​’ ఉన్న ఎలక్ట్రిక్​ కార్స్​ ఇవే..!

Electric cars with highest range : ది బెస్ట్​ ‘రేంజ్​’ ఉన్న ఎలక్ట్రిక్​ కార్స్​ ఇవే..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 28, 2022 12:06 PM IST

Electric cars with highest range : ఎలక్ట్రిక్​ కారు కొనాలని చూస్తున్నారా? ది బెస్ట్​ రేంజ్​ ఉన్న ఈవీ లిస్ట్​ మీకోసం..

ది బెస్ట్​ ‘రేంజ్​’ ఉన్న ఎలక్ట్రిక్​ కార్స్​ ఇవే!
ది బెస్ట్​ ‘రేంజ్​’ ఉన్న ఎలక్ట్రిక్​ కార్స్​ ఇవే!

Electric cars with highest range : ఇండియాలో ఇప్పుడు ఎలక్ట్రిక్​ వాహనాల హవా నడుస్తోంది. నెలకో కొత్త మోడల్​తో ఆటో సంస్థలు కస్టమర్లను పలకరిస్తున్నాయి. మరి మీరు కూడా ఓ ఎలక్ట్రిక్​ కారును తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియా మార్కెట్​లో.. 'రేంజ్'​ పరంగా అందుబాటులో ఉన్న ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ వాహనాలను ఇప్పుడు చూద్దాం..

బీవైడీ అట్టో 3 ఈవీ..

BYD Atto 3 range : ఓ చైనా సంస్థ నుంచి ఇండియాలోకి వచ్చిన తొలి ఎలక్ట్రిక్​ కారు ఈ బీవైడీ అట్టో 3 ఈవీ. జీప్​ కంపాస్​ వంటి ప్రీమియం ఈవీ సెగ్మెంట్​లో చోటు దక్కించుకుంది ఈ వెహికిల్​. ఇందులో 60.48కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో పాటు 204పీఎస్​ ఎలక్ట్రిక్​ మోటర్​ ఉన్నాయి. 80కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జర్​తో 0-80శాతం ఛార్జింగ్​ 50 నిమిషాల్లోనే పూర్తవుతుందని సంస్థ చెబుతోంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ బీవైడీ అట్టో 3 ఈవీ.. 521 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. దీని ధర రూ. 33.99లక్షలు(ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ప్రైజ్​).

ప్రవైగ్​ డిఫై ఈవీ..

Pravaig Defy SUV launch : ప్రవైగ్​ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇది. దీనిని ఇటీవలే లాంచ్​ చేసింది ఈ స్టార్టప్​ సంస్థ. సైజుతో పోల్చుకుంటే.. మహీంద్రా ఎక్స్​యూవీ700, టయోట ఫార్చ్యూనర్​ కన్నా పెద్దగా ఉంటుంది ఈ ఎస్​యూవీ. ఇందులో డ్యూయెల్​ మోటార్​తో పాటు 90కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని ధర రూ. 39.5లక్షలు(ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ప్రైజ్​). ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ వాహనం 500 కి.మీలకుపైగా దూరాన్ని కవర్​ చేస్తుంది.

ప్రవైగ్​ డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

కియా ఈవీ6..

Kia EV6 in India : కియా మోటార్స్​ నుంచి ఇండియాలోకి వచ్చిన తొలి వెహికిల్​ ఈ కియా ఈవీ6. ఇందులో సింగిల్​ మోటార్​, డ్యుయెల్​ మోటార్​ సెటప్​ ఉంది. 350కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జర్​తో.. 18 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్​ అయిపోతుందని సంస్థ చెబుతోంది. 77.4కేబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉండటంతో.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ కియ ఈవీ6.. 708కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ అంటోంది. ధర రూ. 59.95లక్షలు- రూ. 64.95లక్షలు(ఎక్స్​షోరూం).

హ్యుందాయ్​ ఐయోనిక్​ 5..

Hyundai Ioniq 5 price : ఇండియాలో రెండో ఈవీని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది హుందాయ్​. కియా ఈవీ6కు తగ్గట్టుగానే ఈ ఐయోనిక్​ 5 ఉంటుందని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే. కియా ఈవీ6లో ఉన్న మోటార్లే ఇందులోనూ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇదే నిజమైతే.. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. దాదాపు 700కి.మీల దూరం ప్రయాణించే అవకాశం ఉంది. ధర రూ. 50లక్షలు(అంచనా).

ఎలక్ట్రిక్​ వెహికిల్​ను కొనుగోలు చేసే ముందు పరిగణించాల్సిన అంశాలను తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

బీఎండబ్ల్యూ ఐ4..

BMQ i4:- బీఎండబ్ల్యూ నుంచి ఇండియాలోకి వచ్చి రెండో ఈవీగా నిలిచింది ఈ ఐ4 వేరియంట్​. ఇది సెడాన్​ మోడల్​. ఇందులో సింగిల్​ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. 83.9కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉన్న ఈ ఐ4.. 340పీఎస్​, 430ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ వెహికిల్​.. 590కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. దీని ధర రూ. 69.9లక్షలు(ఎక్స్​షోరూం).

Whats_app_banner

సంబంధిత కథనం