How to choose best electric car : ది బెస్ట్ ఎలక్ట్రిక్ కారును ఎంచుకోవడం ఎలా?
How to choose the best electric car : కొత్తగా ఓ కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఎలక్ట్రిక్ ఆప్షన్లు చూస్తున్నారా? అయితే.. ఇది మీ కోసమే.
How to choose the best electric car : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగం రూపురేఖలు.. కొన్ని నెలల్లోనే పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడైతే.. ఒకటో, రెండో ఈవీలు ఉండేవి. కానీ ఇప్పుడు.. ఈ రంగంపై పట్టు సాధించే క్రమంలో.. ఆటో సంస్థలు ఎన్నో ఈవీ మోడల్స్‌ను లాంచ్ చేసేశాయి. రానున్న కాలంలో మరెన్నో ఈవీలు రోడ్ల మీద చక్కర్లు కొట్టనున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. ఇన్ని అప్షన్స్లో.. మన అవసరాలకు తగ్గట్టుగా ఉండే మంచి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంచుకోవడం ఎలా? ఎలక్ట్రిక్ వెహికిల్‌ను తీసుకునే ముందు.. ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఛార్జింగ్ ఫెసిలిటీ..
ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకునేటప్పుడు.. చూడాల్సిన కొన్ని కీలక అంశాల్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి. ఇంటికి దగ్గర్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా? ఉంటే.. ఎన్ని ఉన్నాయి? అన్నవి తెలుసుకోవాలి. అయితే.. కారును ఎక్కువ సేపు ఎక్కడ ఉంచుతామో.. అక్కడే ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంటే బాగుటుంది. ఛార్జింగ్ స్టేషన్లతోనే పని జరగాలంటే.. అవి ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే.. మనకున్న పనులను పక్కనపెట్టి.. కేవలం ఛార్జింగ్ స్టేషన్లలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. అదే.. ఇంట్లోనే ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటే.. స్లో ఛార్జింగ్ ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు.
రేంజ్..
Electric vehicles in India : ఎలక్ట్రిక్ వాహనాల్లో మరో కీలక విషయం 'రేంజ్'. సిటీలోనే నిత్యం తిరిగే కస్టమర్లు.. తక్కువ రేంజ్ ఉన్న ఈవీలను ఎంచుకోవచ్చు. ఇంటి దగ్గరే ఛార్జింగ్ చేసుకోవచ్చు కాబట్టి.. అప్ అండ్ డౌన్‌కు సరిపోతుంది. కానీ దూర ప్రయాణాలు చేయాలని భావించే వారికి మాత్రం.. ఈవీ డ్రైవింగ్ రేంజ్ ఎక్కువగానే ఉండాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.
మార్కెట్లో.. ది మోస్ట్ అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ వాహనాల లిస్ట్‌ను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈవీ టైప్..
ప్రస్తుతం.. ఇండియాలో ఉన్న ట్రెండ్ ప్రకారం.. కస్టమర్లు సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కన్నా ఎస్యూవీలవైపే మొగ్గుచూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే.. సెడాన్, హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే.. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ధరలు ఎక్కువగా ఉంటాయి. ప్రీమియం సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న ఈవీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ప్రీమియం సెగ్మెంట్ కార్లతో.. డ్రైవింగ్ రేంజ్ కూడా పెరుగుతుంది.
ఎలక్ట్రిక్ వెహికిల ధర..
Electric vehicle prices in India : ఇండియాలో.. ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకు దొరుకుతున్న వాహనం.. టాటా టియాగో ఈవీ. దీని ఎక్స్‌షోరూం ధర.. ప్రస్తుతం రూ. 8.49లక్షలుగా ఉంది. కానీ ఇది కేవలం నగరంలో ప్రయాణాలకు మాత్రమే పనికొస్తుంది! దూర ప్రయాణాలు చేయాలని భావించే కస్టమర్లు.. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ తరహా వాహనాలను ఎంచుకోవడం ఉత్తమం. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 18.34లక్షలుగా ఉంది.
ఇండియాలో ఈవీ మార్కెట్‌కు బంగారు భవిష్యత్తు ఉందని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటో సంస్థల మధ్య పోటీ.. రోజురోజుకు పెరుగుతోంది. అదే సమయంలో ధరలు కూడా దిగొస్తున్నాయి. పైన చెప్పిన టిప్స్ పాటించి.. మీ అవసరాలకు తగ్గట్టుగా.. సరైన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంపిక చేసుకోండి.