Affordable electric cars in India : ఈ ‘ఈవీ’ల ధర తక్కువ.. సేఫ్టీ ఎక్కువ!-list of top safe and affordable electric cars in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  List Of Top Safe And Affordable Electric Cars In India

Affordable electric cars in India : ఈ ‘ఈవీ’ల ధర తక్కువ.. సేఫ్టీ ఎక్కువ!

Sharath Chitturi HT Telugu
Oct 16, 2022 02:03 PM IST

Affordable electric cars in India : దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ కోసం ఆటో సంస్థల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు తగ్గుతున్నాయి. దేశంలో సెఫ్టీ ఎక్కువగా ఉండి, తక్కువ ధరకే లభిస్తున్న ఎలక్ట్రిక్​ వాహనాలను ఓసారి చూద్దాం..

సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..!
సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..! (HT Auto)

Affordable electric cars in India : దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్​ వాహనాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కానీ ఆ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో, ఇంత కాలం ఆ ఆలోచనను ఉపసంహరించుకున్నారు. కానీ దేశంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎలక్ట్రిక్​ కార్లు అంటే.. ఒకప్పుడు 1,2 సంస్థలే తయారు చేసేవి. కానీ ఇప్పుడు ఆ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అనేక ఆటో సంస్థలు తయారీ షురూ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆటో సంస్థల మధ్య తీవ్ర పోటీ పెరిగింది. ఇలా పోటీ ఉండటం.. కస్టమర్లకు ఒకింత మంచి విషయమే! పోటీ కారణంగా ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు దిగొస్తున్నాయి. సరసమైన ధరల్లో, అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎలక్ట్రిక్​ వాహనాలను మార్కెట్​లోకి తీసుకొస్తున్నాయి ఆటో సంస్థలు.

ట్రెండింగ్ వార్తలు

ఇక్కడ ఎలక్ట్రిక్​ వాహనాల ధరలతో పాటు సెఫ్టీ ఫీచర్స్​ని కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. కారు భద్రతా ప్రమాణాలు కూడా కీలకమే కదా. అందువల్ల.. దేశంలో అధిక సెఫ్టీతో పాటు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాల లిస్ట్​ను ఓసారి చూద్దాం.

టాటా టిగోర్​ ఈవీ..

Tata Tigor EV : దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్​ కారుగా గుర్తింపు పొందింది టాటా టిగోర్​ ఈవీ. గ్లోబల్​ ఎన్​సీఏపీ సేఫ్టీలో ఈ కారుకు 4 స్టార్​ రేటింగ్​ లభించింది. 2021 ఆగస్టులో దీనిని టెస్ట్​ చేశారు. 17 పాయింట్లకు(అడల్ట్​ ప్రొటెక్షన్​) గాను 12 పాయింట్లు దక్కించుకుంది టాటా టిగోర్​ ఈవీ. ఇక చైల్డ్​ ప్రొటెక్షన్​ విషయంలో 49పాయింట్లకు గాను 37.24పాయింట్లు సంపాదించుకుంది.

ఇందులో డ్యూయెల్​ ఫ్రంట్​ ఎయిర్​బ్యాగ్స్​, స్టాండర్డ్​ సీట్​ బెల్ట్​ రిమైండర్​ ఫీచర్స్​ ఉన్నాయి. దేశంలో టాటా టిగోర్​ ఈవీ ఎక్స్​ షోరూం ధర రూ. 12.24లక్షలుగా ఉంది.

బీవైడీ అట్టో 3..

BYD Atto 3 : ఇండియా ఎలక్ట్రిక్​ వాహనాల మార్కెట్​లోకి కొత్తగా అడుగుపెట్టింది బీవైడీ అట్టో 3. యూరో ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ చైనీస్​ ఈవీ వాహనానికి 4 స్టార్​ రేటింగ్​ లభించింది. అడల్ట్​ ప్రొటెక్షన్​లో 91శాతం, చైల్డ్​ ప్రొటెక్షన్​లో 89శాతం మార్కులు ఇది దక్కించుకుంది.

యూరో ఎన్​సీఏపీ టెస్ట్​లో వినియోగించిన బీవైడీ అట్టో 3 ఎలక్ట్రిక్​ కారుకు డ్యూయెల్​ ఫ్రెంట్​ ఎయిర్​బ్యాగ్స్​ ఉన్నాయి. బెల్ట్​ ప్రీ టెన్షనర్​, బెల్ట్​ లోడ్​ లిమిటర్​, సైడ్​ హెడ్​ ఎయిర్​బ్యాక్స్​ ఇందులో సెఫ్టీ ఫీచర్స్​. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వాహనం ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే.. సరసమైన ధరల్లోనే ఇది లాంచ్​ అవుతుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

హుండాయ్​ కోనా ఈవీ.

Hyundai Kona Ev price : ఏఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో హుందాయ్​ కోనా ఈవీ వాహనం 5 స్టార్​ రేటింగ్​ను సంపాదించుకుంది! కోనా ఈవీకి.. ఫ్రంటల్​ ఆఫ్​సెట్​ ఇంపాక్ట్​లో 37పాయింట్లకు గాను 35.07పాయింట్లు దక్కాయి. ఆస్ట్రేలియాలో ఈ టెస్ట్​ నిర్వహించారు. హుందాయ్​ కోనా ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 23.84లక్షలు- రూ. 24.03లక్షల మధ్యలో ఉంది.

ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ..

MG ZS EV : ఈ ఎలక్ట్రిక్​ వాహనానికి యూరో ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో 5స్టార్​ రేటింగ్​ లభించింది. అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​లో 90శాతం, చైల్డ్​ ప్రొటెక్షన్​లో 85శాతం మార్కులు ఇది సంపాదించుకుంది. ఫ్రంట్​ ఎయిర్​బ్యాగ్స్​, సైడ్​ హెడ్​ ఎయిర్​బ్యాగ్స్​, సీట్​బెల్ట్​ రిమైండర్స్​ వంటివి ఇందులో సేఫ్టీ ఫీచర్​గా ఉంది. ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 22.58లక్షలు- 26.50లక్షల మధ్యలో ఉంది.

వీటితో పాటు టాటా టియాగో ఈవీ కూడా కొత్తగా లాంచ్​ అయ్యింది. ఇండక్షన్​ ప్రైజ్​ కింద.. రూ. 9లక్షలోపే ఈ వాహనాన్ని కస్టమర్లకు ఇస్తున్నారు. 20వేల మందికి ఈ ఆఫర్​ ఇచ్చారు. ఆ తర్వాత.. ఈ వాహనం ధర పెరిగే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం