Tata Tiago EV bookings : ‘టియాగో ఈవీ’కి బుకింగ్స్​ జోరు- తొలి 24 గంటల్లోనే..!-tata tiago ev gets over 10 000 bookings in less than 24 hours ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Tata Tiago Ev Gets Over 10,000 Bookings In Less Than 24 Hours

Tata Tiago EV bookings : ‘టియాగో ఈవీ’కి బుకింగ్స్​ జోరు- తొలి 24 గంటల్లోనే..!

Sharath Chitturi HT Telugu
Oct 11, 2022 01:00 PM IST

Tata Tiago EV bookings : టాటా టియాగో ఈవీ బుకింగ్స్​ జోరుగా సాగుతున్నాయి. 24 గంటల్లోనే ఈ ఎలక్ట్రిక్​ వాహనానికి 10వేలకుపైగా బుకింగ్స్​ లభించడం విశేషం.

టాటా టియాగో ఈవీ
టాటా టియాగో ఈవీ

Tata Tiago EV bookings : టాటా టియాగో ఈవీకి అదిరిపోయే రెస్పాన్స్​ లభిస్తోంది! ఈ నెల 10న కారు బుకింగ్స్​ ప్రారంభం కాగా.. 24 గంటల్లోనే 10,000కుపైగా బుకింగ్స్​ వచ్చాయి. ఎలక్ట్రిక్​ వాహనాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనం అని టాటా మోటార్స్​ చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా.. టాటా టియాగో ఈవీ స్పెషల్​ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ను(రూ. 8.49లక్షలు ఎక్స్​షోరూం) మరో 10వేల కస్టమర్లకు పొడిగిస్తున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించింది.

"టియాగో ఈవీకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈవీ జర్నీలో పాలుపంచుకుంటున్న కస్టమర్లకు ధన్యవాదాలు. ఈవీవైపు అడుగు వేయాలన్న కస్టమర్ల ఆసక్తిని ప్రోత్సహిస్తూ.. టియాగో ఈవీ ఇంట్రొడక్టరీ ప్రైజింగ్​ని అదనంగా మరో 10వేల మందికి అందిస్తున్నాము," అని టాటా మోటార్స్​ మేనేజింగ్​ డైరక్టర్​ శైలేష్​ చంద్ర ప్రకటించారు.

టాటా టియాగో ఈవీ బుకింగ్​..

Tata Tiago EV booking online : టాటా మోటార్స్​ అధికారిక వెబ్​సైట్​లో టాటా టియాగో ఈవీని బుక్​ చేసుకోవచ్చు. లేదా.. స్థానిక టాటా మోటార్స్​ డీలర్​షిప్​ షోరూంకు వెళ్లి టాటా టియాగో ఈవీని బుక్​ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్​ కారు కోసం.. బుకింగ్​ ధర రూ. 21,000గా ఉంది.

2023 జనవరి నుంచి టియాగో ఈవీ వాహనాల డెలవరీ ఉంటుందని సంస్థ చెబుతోంది. మిగిలిన వివరాలు డెలివరీ సమయంలో కస్టమర్లకు చెబుతామని టాటా మోటార్స్​ స్పష్టం చేసింది.

టాటా టియాగో అస్త్రం..

దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. ఈ రంగంలో టాటా మోటార్స్​దే అధిక వాటా ఉంది. అయితే మహీంద్రా అండ్​ మహీంద్రా.. ఎలక్ట్రిక్​ వాహన రంగంలో టాటా మోటార్స్​కు బలమైన పోటీనిస్తోంది. ఎం అండ్​ ఎం పోటీకి చెక్​ పెట్టేందుకు.. టియాగో ఈవీ అస్త్రాన్ని ప్రయోగించింది టాటా మోటార్స్​. దేశంలో మరే ఇతర ఎలక్ట్రిక్​ వాహనానికి లేనంత అతి తక్కువ ధరకు టియాగో ఈవీని లాంచ్​ చేసింది. ఊహించినట్టుగానే ఈ కార్​కు అదిరిపోయే ఆదరణ లభిస్తోంది.

Tata Tiago EV : టాటా టియాగో ఈవీకి రెండు బ్యాటరీ ప్యాక్​లు ఉన్నాయి. ఒకటి 24కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​, ఇంకోటి 19.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​. మొదటి బ్యాటరీతో 315కి.మీల దూరం ప్రయాణించవచ్చు. రెండో బ్యాటరీతో 250కి.మీల దూరం బండిని నడపవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం