BYD Atto3 EV | కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగం.. 480 కిమీ రేంజ్ దీని సొంతం!
BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) అనే చైనీస్ వాహన తయారీ సంస్థ, తాజాగా తమ బ్రాండ్ నుంచి BYD Atto3 అనే ఎలక్ట్రిక్ SUVని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కార్ ఒక ఫుల్ ఛార్జ్ మీద సుమారు 480 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కార్ లుక్, ఫీచర్స్ చూడండి.
(1 / 8)
BYD ఇండియా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'అట్టో3' కారుని ఆవిష్కరించింది. రూ. 50,000 టోకెన్ ధర చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. మొదటి 500 యూనిట్ల డెలివరీలు జనవరి 2023 నుండి ప్రారంభమవుతాయి.
(2 / 8)
BYD Atto3 EV డ్రాగన్ ఫేస్ డిజైన్‌తో ఏరోడైనమిక్ ప్రొఫైల్‌తో వస్తుంది. దీని ఫ్రంట్ ఫేస్ క్రిస్టల్ LED కాంబినేషన్ హెడ్‌లైట్‌లతో వస్తుంది.
(5 / 8)
BYD Atto3 ఎలక్ట్రిక్ SUV యొక్క క్యాబిన్‌లో డ్యాష్ బోర్డుకు 12.8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనిని 8-స్పీకర్ల సిస్టమ్‌కు కనెక్ట్ చేశారు. ఇంకా 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ఇది NFC కార్డ్ కీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రికల్ సీట్ సర్దుబాటు ఫీచర్‌లు ఉన్నాయి.
(8 / 8)
BYD Atto3 EVలోని ఎలక్ట్రిక్ మోటార్ 200 hp శక్తిని, 310 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కార్ కేవలం 7.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఎకో, స్పోర్ట్ , నార్మల్ అనే మూడు మోడ్‌లను అందిస్తున్నారు. ఈ కార్ ధర సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
ఇతర గ్యాలరీలు