MG ZS EV Excite । బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?-mg motors launches mg zs ev excite check base variant price features range and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Zs Ev Excite । బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ Suv వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?

MG ZS EV Excite । బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Oct 03, 2022 10:19 AM IST

MG మోటార్ ఇండియా తమ ఎలక్ట్రిక్ SUV మోడల్ MG ZS EV కారులో బేస్ వేరియంట్ కార్ MG ZS EV Excite వాహనాన్ని విడుదల చేసింది. దీని ధర, ఫీచర్లు, ఇతర వివరాలు చూడండి.

<p>MG ZS EV Excite</p>
MG ZS EV Excite

బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ MG మోటార్, ఈ ఏడాది ప్రారంభంలో తమ బ్రాండ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం MG ZS EV ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV ఎక్సైట్‌, ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. అయితే ఇందులో టాప్-స్పెక్ మోడల్ అయినటువంటి MG ZS EV Exclusive వేరియంట్ మాత్రమే ఇప్పటివరకు అమ్మకానికి వచ్చింది. ఇప్పుడు దీనికి బేస్ వేరియంట్ అయినటువంటి MG ZS EV Excite వాహనాన్ని కూడా MG మోటార్ ఇండియా విడుదల చేసింది.

నిజానికి జూలై మాసంలోనే ఈ మోడల్ విడుదల కావాల్సింది, అయితే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ MG ZS EV Excite వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు. ప్రీబుకింగ్ చేసుకున్నవారికి ఈ నెల నుంచే ఎక్సైట్ వేరియంట్ డెలివరీలను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మరి బేస్ వేరియంట్ కార్ ధరలు ఎలా ఉన్నాయి, ఈ ఎలక్ట్రిక్ SUV లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సహా మిగతా అన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

MG ZS EV Excite Prices- ధర ఎంతంటే?

భారత మార్కెట్లో MG ZS EV ని అధికారికంగా లాంచ్ చేసినపుడు బేస్ వేరియంట్ MG ZS EV ఎక్సైట్ ధర, రూ. 21.99 లక్షలు అలాగే టాప్-స్పెక్ వేరియంట్ ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్ ధర, రూ. 25.88 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కానీ, ఇంతలోనే ధరలను పెంచేశారు.

ప్రస్తుతం బేస్ వేరియంట్ MG ZS EV Excite రూ. 22.58 లక్షలకు అందుబాటులో ఉంది. MG ZS EV Exclusive వేరియంట్ ధర ఇప్పుడు రూ. 26.49 లక్షలకు అందుబాటులో ఉంది. అంటే కనీసం రూ. 60 వేల మేర ధరలు పెరిగాయి.

MG ZS EV Excite Range, Features - ప్రయాణ పరిధి, ఫీచర్లు

MG ZS EV ఎక్సైట్ వేరియంట్లో కూడా ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్‌లో ఉన్నట్లుగానే అదే 50.3kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్క ఫుల్ ఛార్జింగ్‌పై 461కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 174bhp శక్తిని, 280Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ 8.5 సెకన్లలోనే 0-100kmph వేగాన్ని అందుకోగలదు.

బేస్ వేరియంట్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, క్లైమేట్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, ఐ-స్మార్ట్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాప్-స్పెక్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, వెనుక డ్రైవర్ అసిస్ట్ మొదలైనవి అదనంగా ఉంటాయి.

సరికొత్త MG ZS EV భారతీయ రహదారులపై మహీంద్రా XUV400 EV అలాగే టాటా నెక్సాన్ EV MAX వంటి సెగ్మెంట్ వాహనాలతో పోటీపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం